/rtv/media/media_files/2025/10/09/nobel-2025-10-09-17-30-20.jpg)
Hungarian author László Krasznahorkai wins 2025 Nobel Prize in Literature
ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ బహుమతి(nobel-prize)ని ప్రముఖ హంగేరియన్ రచయిత లాస్లో క్రాస్జ్నాహోర్కై దక్కించుకున్నారు. ప్రళయాల మధ్య కూడా కళ శక్తిని చూపించిన ఆయన రచనలకు గాను ఈ అత్యున్నత గౌరవం దక్కినట్లు స్వీడిష్ అకాడమీ పేర్కొంది. గతేడాది సాహిత్యంలో నోబెల్ బహుమతి దక్షిణ కొరియాకు చెందిన రచయిత్రి హాన్ కాంగ్‌కు వచ్చింది. ఇక క్రాస్జ్నాహోర్కై.. గంభీరమైన వాక్య నిర్మాణాలు, నిరాశ, భవిష్యత్తు గురించి భయపెట్టే ఇతివృత్తాలతో కూడిన పోస్ట్‌మోడర్న్ నవలలు రచించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ముఖ్య రచనలలో 'సాతాన్ ట్యాంగో, 'ది మెలాంకోలీ ఆఫ్ రెసిస్టెన్స్' ఉన్నాయి.
Also Read : బ్రిటన్ ప్రధాని రాకతో.. భారత్‌కు లాభమేంటో తెలుసా?
Hungarian Author Laszlo Krasznahorkai Wins 2025 Nobel Prize
BREAKING NEWS
— The Nobel Prize (@NobelPrize) October 9, 2025
The 2025 #NobelPrize in Literature is awarded to the Hungarian author László Krasznahorkai “for his compelling and visionary oeuvre that, in the midst of apocalyptic terror, reaffirms the power of art.” pic.twitter.com/vVaW1zkWPS
ఇదిలాఉండగా నోబెల్ సాహిత్య బహుమతిని స్వీడిష్ అకాడమికి చెందిన నోబెల్ కమిటీ విజేతలకు ప్రధానం చేస్తుంది. స్వీడిష్ అకాడమీ సభ్యులు ముందుగా నామినేటెడ్ అభ్యర్థుల రచనలను సీక్రెట్‌గా అంచనా వేస్తారు. అకాడమీ సభ్యులు ఎవరికి ఎక్కువగా మద్దతిస్తే వాళ్లే నోబెల్ బహుమతికి తుది అర్హత సాధిస్తారు. నోబెల్ బహుమతికి సంబంధించి గోప్యతా నియమం అన్ని విభాగాలకు వర్తిస్తుంది.
Also Read: వరల్డ్ టాప్ హండ్రెడ్ లో భారత యూనివర్శిటీలకు దక్కని చోటు..పధ్నాలుగేళ్ళల్లో ఇదే మొదటిసారి
అక్టోబర్ 6న నోబెల్ బహుమతి పురస్కారాలు ప్రకటన మొదలైన విషయం తెలిసిందే. అక్టోబర్ 13 వరకు ఇది కొనసాగించనున్నారు. ఇటీవల వైద్యశాస్త్రంలో, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రమం నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న వాళ్ల పేర్లు ప్రకటించారు. గురువారం సాహిత్యం విభాగంలో నోబెల్ బహుమతి విజేత పేరును ప్రకటించారు. ఇక శుక్రవారం శాంతి బహుమతి, చివరగా అక్టోబర్ 13న అర్థశాస్త్రంలో ఈ పురస్కారం అందుకోబోయే వాళ్ల పేర్లు ప్రకటించనున్నారు.
Also Read: ఇది ఇజ్రాయెల్ నైతిక విజయం...బందీల విడుదలపై నెతన్యాహు ఎమోషనల్ పోస్ట్