Crime: స్కూల్‌లో విద్యార్థినికి 100 గుంజీలు.. మృతి చెందిన బాలిక

మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లాలో దారుణం జరిగింది. స్కూల్‌కు లేట్‌ వచ్చిందనే కారణంలో ఓ టీచర్‌ విద్యార్థినికి బలవంతంగా 100 గుంజీలు తీయించింది. దీంతో అస్వస్థకు గురైన ఆ బాలిక మ-ృతి చెందడం కలకలం రేపింది.

New Update
Maharashtra Teacher Who Forced Class 6 Girl To Do 100 Sit Ups Arrested

Maharashtra Teacher Who Forced Class 6 Girl To Do 100 Sit Ups Arrested

మహారాష్ట్ర(maharashtra)లోని పాల్ఘర్‌ జిల్లాలో దారుణం జరిగింది. స్కూల్‌కు లేట్‌ వచ్చిందనే కారణంలో ఓ టీచర్‌ విద్యార్థినికి బలవంతంగా 100 గుంజీలు తీయించింది. దీంతో అస్వస్థకు గురైన ఆ బాలిక మ-ృతి చెందడం కలకలం రేపింది. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ఉపాధ్యాయురాలిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. 6వ తరగతి చదువుతున్న ఓ బాలిక ఈ నెల 8న స్కూల్‌కు లేట్‌గా వచ్చింది. దీంతో స్కూల్ టీచర్‌ 100 గుంజీలు తీయాలంటూ బలవంతం చేసింది.   

Also Read: సీఎంగా నితీశ్‌ కుమార్‌ ప్రమాణం.. మౌనవ్రతంలోకి వెళ్లిన ప్రశాంత్ కిషోర్

Class 6 Girl Dies To Do 100 Sit Ups

అప్పటికే ఆ బాలిక అనారోగ్యంతో బాధపడుతోంది. గుంజీలు తీస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈ నేపథ్యంలోనే ఆమెను ముంబయిలో ఓ ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స తీసుకుంటూ ఆ బాలిక మృతి చెందింది. అయితే బ్యాగు వీపుపై పెట్టుకుని మరి తన కూతురిని గుంజీలు తీయించారని బాలిక తల్లి ఆరోపిస్తోంది. 

Also Read: షాకింగ్ వీడియో: పెళ్లిలో డ్యాన్సర్ ప్రైవేట్ పార్ట్‌ తాకిన వరుడి మామ.. గొడవ గొడవ

బాలిక మృతి చెందిన ఘటనపై అక్కడి స్థానికులు కూడా ఆందోళనలు చేపట్టారు. పోలీసులు దీనిపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. బాలికతో గుంజీలు తీయించిన ఉపాధ్యాయురాలిని కూడా అరెస్టు చేశారు. మరోవైపు ఈ ఘటనపై విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా విచారణ ప్రారంభించారు. 

Advertisment
తాజా కథనాలు