Viral Video: షాకింగ్ వీడియో: పెళ్లిలో డ్యాన్సర్ ప్రైవేట్ పార్ట్‌ తాకిన వరుడి మామ.. గొడవ గొడవ

హర్యానాలో జరిగిన పెళ్లి వేడుక రణరంగాన్ని తలపించింది. డ్యాన్సర్లు, పెళ్లి కొడుకు మామ తరపు వారు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తున్న మహిళతో వరుడి మామ అసభ్యంగా ప్రవర్తించడంతో లొల్లి మొదలైంది.

New Update
Marriage Dance Video

Marriage Dance Video

హర్యానా(haryana) లో జరిగిన పెళ్లి వేడుక రణరంగాన్ని తలపించింది. డ్యాన్సర్లు, పెళ్లి కొడుకు మామ తరపు వారు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తున్న మహిళతో వరుడి మామ అసభ్యంగా ప్రవర్తించడంతో లొల్లి మొదలైంది. మహిళా డ్యాన్సర్‌పై వరుడి మామ చేయి చేసుకోవడం.. ఆ తర్వాత ఆ మహిళ కూడా చేయి లేపడంతో గొడవ కాస్త ఉగ్రరూపం దాల్చి ఇరు వర్గాలు బాదుకునేవరకు వెళ్లింది. ఏం జరిగిందోనన్న విషయానికొస్తే..

Also Read :  నితీష్ పూల దండ వేసిన అభ్యర్థికి మంత్రి పదవి.. ఎవరీ రమా నిషాద్?

డ్యాన్సర్ ప్రైవేట్ పార్ట్ తాకి

నుహ్ జిల్లా మేవాట్ ప్రాంతంలో నవంబర్ 17,2025న అంగరంగ వైభవంగా ఒక పెళ్లి జరుగుతోంది. ఈ వేడుకను మరింత సరదా, సందడిగా చేసేందుకు పెళ్లి కొడుకు.. డ్యాన్సర్లతో ఈవెంట్ ఏర్పాటు చేశాడు. దీంతో రాత్రి పూట డీజే సాంగ్‌లతో పెళ్లిలో సందడి వాతావరణం కనిపించింది. అందరూ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. డ్యాన్సర్ల బృందం డ్యాన్స్ చేస్తుండగా.. చుట్టూ ఉన్న పెళ్లి వారు కూడా తమ స్టెప్పులతో హోరెత్తించారు. - dance-video

Also Read :  షూటర్కు మోడీ మంత్రి పదవి... ఎవరీ  శ్రేయాషి సింగ్?

ఇలా ఇద్దరు మహిళా డ్యాన్సర్లు అదిరిపోయే స్టెప్పులు వేస్తుండగా.. పక్కనే ఉన్న పెళ్లికొడుకు మామ డబ్బులు తీసి ఒక మహిళా డ్యాన్సర్ ప్రైవేట్ పార్ట్‌లో పెట్టి తాకాలని ప్రయత్నించాడు. అతని అభ్యంతరకర ప్రవర్తనకు ఆమె కోపం తెచ్చుకుంది. వెంటనే అతడి చేతిపై కొట్టిది. దీంతో అతడు కూడా కోపంతో ఆ మహిళా డ్యాన్సర్‌ చెంప చెల్లుమనిపించాడు. - viral news telugu

అప్పుడు పక్కనే ఉన్న తోటి డ్యాన్సర్లు ఆ గొడవను ఆపేందుకు వెళ్లగా.. వరుడి బంధువులు ఒక్కసారిగా వారిపై దాడికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. వరుడి బంధువులు డ్యాన్సర్లను పొట్టు పొట్టు కొట్టారు. కర్రలతో కొడుతూ, పిడుగుద్దులు గుద్దుతూ డ్యాన్లర్లపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో ఒక డ్యాన్సర్‌కు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. 

ఈ ఘటన మొత్తాన్ని అక్కడే ఉన్న ఒక వ్యక్తి తన మొబైల్ ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. అందిన సమాచారం ప్రకారం.. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. 

Advertisment
తాజా కథనాలు