/rtv/media/media_files/2025/11/20/prashant-kishor-2025-11-20-16-14-10.jpg)
Prashant Kishor Holds 'Maun Vrat' As Nitish Kumar Returns As Chief Minister
బిహార్(national news in Telugu) లో పదోసారి ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించారు. ఈ నేపథ్యంలో జన్‌సురాజ్ పార్టీ(Jan Suraj Party) చీఫ్ ప్రశాంత్ కిషోర్(prashanth-kishore) మౌనవ్రతంలోకి వెళ్లారు. ఒకరోజు పాటు ఆయన మౌనవ్రతం పాటిస్తున్నారు. పశ్చిమ చంపారన్‌లోని భితిహర్వా గాంధీ ఆశ్రమంలో ఆయన దీక్షను చేపట్టారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విఫలం అయినందుకు తానే పూర్తి బాధ్యత తీసుకుంటున్నానని పేర్కొన్నారు.
Also Read: నితీష్ పూల దండ వేసిన అభ్యర్థికి మంత్రి పదవి.. ఎవరీ రమా నిషాద్?
Prashant Kishor Holds 'Maun Vrat' As Nitish Kumar
మౌనవ్రతానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు.'' బిహార్ ప్రజలు ఏ అంశం ఆధారంగా ఓటేయాలి? కొత్త ప్రభుత్వాన్ని, వ్యవస్థను ఎందుకు సృష్టించాలని అనే దాన్ని వివరించడంలో ఫెయిల్ అయ్యాను. దీనికి ప్రాయశ్చిత్తంగానే మౌనవ్రతం చేస్తున్నాను. ఎన్నికల్లో నేను గెలవలేకపోయినప్పటికీ బీహార్‌ను అభివృద్ధి చేయాలనే సంకల్పాన్ని నెరవేర్చే వరకు వెనక్కి తగ్గనని'' ప్రశాంత్ కిశోర్ తేల్చిచెప్పారు.
Also Read: నితీష్ పూల దండ వేసిన అభ్యర్థికి మంత్రి పదవి.. ఎవరీ రమా నిషాద్?
ఇదిలాఉండగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 202 స్థానాల్లో గెలిచిన సంగతి తెలిసిందే. మహాగఠ్‌బంధన్ కూటమి మాత్రం కేవలం 35 స్థానాలకే పరిమితమయ్యింది. కానీ జన్‌సురాజ్ పార్టీ మాత్రం ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయింది. మరోవైపు గురువారం జేడీయూ నేత నితీశ్ కుమార్ పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గతంలో 2005, 2010, 2015లో కూడా ఆయనే ఇక్కడే సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.
Follow Us