Madhya Pradesh Doctor: పిల్లలకు దగ్గు మందు సిరప్ ఇచ్చిన డాక్టర్ అరెస్ట్

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింద్వారా జిల్లాలో కలుషితమైన దగ్గు సిరప్ వల్ల 11 మంది చిన్నారులు మరణించిన కేసులో పోలీసులు కీలక చర్యలు తీసుకున్నారు. ఆ పిల్లల్లో చాలా మందికి అదే దగ్గు మందు సూచించిన డాక్టర్ ప్రవీణ్ సోనిని ఆదివారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు.

New Update
Madhya Pradesh Doctor

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింద్వారా జిల్లాలో కలుషితమైన దగ్గు సిరప్ వల్ల 11 మంది చిన్నారులు మరణించిన కేసులో పోలీసులు కీలక చర్యలు తీసుకున్నారు. మరణించిన పిల్లల్లో(children) చాలా మందికి అదే దగ్గు మందు సూచించిన డాక్టర్ ప్రవీణ్ సోని(Madhya Pradesh Doctor) ని ఆదివారం తెల్లవారుజామున అరెస్ట్(arrest) చేశారు. ఈ విషాదకర ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. చింద్వారా జిల్లాలోని పలు ప్రాంతాల్లో 7 నుంచి 12 ఏళ్లలోపు చిన్నారులు జ్వరం, వాంతులు, ముఖ్యంగా మూత్రపిండాల వైఫల్యంతో ఆసుపత్రులలో చేరారు. చికిత్స పొందుతూ 11 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ మరణాలకు కారణం 'కోల్డ్‌రిఫ్', 'నెక్స్ట్రో-డీఎస్' వంటి దగ్గు సిరప్‌లే అని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

Also Read :  ఓర్నీ.. మారిపోయిన మృతదేహాలు, వేరే వ్యక్తికి అంత్యక్రియలు చేసిన కుటుంబం

Madhya Pradesh Doctor Arrest

చిన్నారుల మృతదేహాలపై నిర్వహించిన బయాప్సీ పరీక్షల్లో.. వారు తీసుకున్న సిరప్‌లో డైథిలిన్ గ్లైకాల్ అనే విషపూరిత రసాయనం కలుషితమై ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ కెమికల్ కారణంగా పిల్లల కిడ్నీలు ఫెయిల్ అయినట్లు అధికారులు తెలిపారు. దీంతో చింద్వారా జిల్లా కలెక్టర్ ఆ దగ్గు సిరప్‌ల విక్రయంపై నిషేధం విధించారు.

Also Read :  గాయకుడు జుబీన్‌ గార్గ్ మృతిలో బిగ్‌ ట్విస్ట్‌.. ఆయనపై విష ప్రయోగం? సంచలన ఆరోపణలు..

మరణించిన చిన్నారుల్లో చాలా మందికి డాక్టర్ ప్రవీణ్ సోని ఈ దగ్గు సిరప్‌ను సూచించినట్లు దర్యాప్తులో వెల్లడి కావడంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయనను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేంద్ర డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆధ్వర్యంలో విసృత దర్యాప్తు జరుగుతోంది. తమిళనాడులోని కాంచీపురంలో ఈ సిరప్‌లను తయారు చేస్తున్న కర్మాగారం నుంచి కూడా శాంపిల్స్ సేకరించి టెస్ట్‌కు పంపించారు. ఈ దారుణానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. తల్లిదండ్రులు వైద్యుల సలహా లేకుండా పిల్లలకు ఎటువంటి దగ్గు సిరప్‌లను ఇవ్వకూడదని అధికారులు హెచ్చరించారు.

Advertisment
తాజా కథనాలు