Road Accident: దసరా సెలవులకు వెళ్తూ తిరిగిరాని లోకాలకు.. ఒళ్ళు గగుర్పొడిచే యాక్సిడెంట్!

దసరా సెలవుల కోసం ఆనందంగా ఇంటికి బయలుదేరిన ఇద్దరి యువకుల జీవితం విషాదకరంగా ముగిసింది. ఇంటికి చేరేలోపే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. బైక్ పై స్వగ్రామానికి  వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదంలో అక్కడిక్కడే మృతి చెందారు.

New Update
accident

accident

Road Accident: దసరా సెలవుల కోసం ఆనందంగా ఇంటికి బయలుదేరిన ఇద్దరి యువకుల జీవితం విషాదకరంగా ముగిసింది. ఇంటికి చేరేలోపే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. బైక్ పై స్వగ్రామానికి  వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదంలో అక్కడిక్కడే మృతి చెందారు. ఈ విషాదకర ఘటన కర్నూలు ప్రధాన రహదారిపై చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయవాడలో చదువుకుంటున్న ఇద్దరు యువకులు దసరా సెలవులు కావడంతో స్వగ్రామానికి బయలు దేరారు. ఈ క్రమంలో వీరిద్దరూ వెళ్తున్న బైక్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.  పొదిలి మండలం పోతవరం వద్ద, ఒంగోలు- కర్నూల్ రహదారి పై ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడిక్కడే మరణించారు. మృతులను హనుమంతుపాడు, వెలిగండ్ల ప్రాంతాలకు చెందిన  బ్రహ్మయ్య, బండ్లమూడిగా గుర్తించారు. స్థానికుల సంచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను పొదిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

Also Read: Singer Zubeen Garg: సింగర్ జుబీన్ గార్గ్ డెత్ కేసులో బిగ్ ట్విస్ట్.. స్టార్ మ్యుజీషియన్ అరెస్ట్!

Advertisment
తాజా కథనాలు