Ilayaraja: అసలైన ఇసైజ్ఞాని.. లయరాజు ఇళయరాజా బర్త్ డే స్పెషల్

ఆయన పాటలకు సంగీతం కడితే ఎవరైనా పడిపోవాల్సిందే. అది ఎలాంటి మ్యూజిక్ అయినా కూడా సూపర్ బంపర్ హిట్. దాదాపు 50 ఏళ్ళుగా తన మ్యాజిక్ తో అందరినీ మంత్ర ముగ్ధులను చేస్తున్న లయరాజు ఇళయరాజా పుట్టిన రోజు ఈరోజు. 

New Update
music

Ilayaraja

ఇప్పుడంటే బోలెడంత మంది మ్యూజిక్ డైకెర్టర్లు, సింగర్స్ వచ్చేశారు కానీ...1980, 1990ల్లో మాత్రం తెలుగు, తమిళ సినిమా రంగాల పాటలను ఏలిన వారు ఇద్దరే. అందులో ఒకరు మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా ఒకరైతే మరొకరు బాలసుబ్రహ్మణ్యం. ఈయన పాటలను స్వరపరచడం..ఆయన పాడడం. మెలోడీ, శాస్త్రీయ సంగీతం, రాక్, ఫోక్, పాప్ ఏదైనా సరే వీళ్ళకు వెన్నతో పెట్టింది విద్య. ఏ హీరో అయినా వీళ్ళ పాటలకు నటించాల్సిందే, డాన్స్ చేయాల్సిందే. పోనీ పాటలు ఏమీ బాగుండవా అంటే...ఆ మాట అనడానికి కూడా వీలు లేదు. ప్రతీపాట సూపర్. అన్నీ హిట్ లే. 90ల్లో వచ్చిన పాటలను ఇప్పటికీ పాడుకుంటున్నారు అంటే దానికి కారణం ఇళయరాజా సంగీతం. ఇతని బుర్రలో, చేతిలో ఏదో మహత్యం ఉంది. ఎవరి సంగీతాన్నీ అనుకరించకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన బాణీని ఏర్పరుచుకున్న ఇళయరాజా.. ఎంతో మంది యువ సంగీత దర్శకులకు ఆదర్శంగా నిలిచారు. దీంతోనే ఆయన సంగీత ప్రియుల జీవితాల్లో ఒక భాగమైపోయారు. 

Also Read :  మరో పాకిస్థానీ స్పై అరెస్ట్.. ఎక్కడంటే...

ఇళయరాజా ముందు జి.కె.వెంకటేష్ అనే ఆయన దగ్గర అసిస్టెంట్ గా చేశారు. అక్కడ 200 సినిమాలకు పని చేశారు. అయితే 1976లో ఇళయరాజా ప్రతిభను గుర్తించి పంజు అరుణాచలం రచయిత అన్నకిలి’ అనే సినిమాకి సంగీత దర్శకత్వం వహించే అవకాశం ఇప్పించారు. ఈయనే రాజా అన్న పేరును ఇళయరాజాగా మార్చారు. ఇళయ అంటే చిన్నవాడు అని అర్ధం. అన్నకిలి సినిమా తర్వాత అదే ఆయన అసలు పేరుగా మారిపోయింది. తనకు తొలి అవకాశం ఇచ్చిన దేవరాజ్‌, మోహన్‌లకు ఆ తర్వాత వారు చేసిన సినిమాలన్నింటికీ సంగీత దర్శకుడుగా పనిచేశారు ఇళయరాజా. తమిళ్‌లో రూపొందిన భద్రకాళి చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో రీమేక్‌ చేశారు. ఈ సినిమా ద్వారా ఇళయరాజా తెలుగులో పరిచయమయ్యారు. 

Also Read :  ఇది తెలిస్తే.. ఈరోజే వెళ్లి సైకిల్ కొంటారు!

మెలోడీ కింగ్..

70ల చివర్లో తెలుగు, తమిళ సినిమాల పాటలను చక్రవర్తి, కె.వి.మహదేవన్, రమేశ్ నాయుడులు ఏలుతున్న రోజులు. అయితే అదే సమయంలో ఇళయరాజా ఎంట్రీ ఇచ్చారు. వారి కంటే భిన్నమైన పాటలను స్వరపరుస్తూ అందరి మనసులనూ దోచుకున్నారు. తెలుగులో అభిలాష, ఛాలెంజ్‌, సాగరసంగమం, సితార, స్వాతిముత్యం, రుద్రవీణ, అన్వేషణ, లేడీస్‌ టైలర్‌, ఏప్రిల్‌ 1 విడుదల, స్వర్ణకమలం చిత్రాల్లోని పాటలన్నీ సూపర్‌హిట్‌ అయ్యాయి. దాంతో తెలుగు, తమిళ్‌లో కూడా నెంబర్‌వన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇళయ రాజా మ్యూజిక్ ను అప్పుడూ కాదు ఇప్పటికీ ఎవరితోనూ పోల్చేలేము. ప్రతీపాట భిన్నంగా, కొత్తగా ఉంటుంది. అభిలాష, ఛాలెంజ్‌, సాగరసంగమం, సితార, స్వాతిముత్యం, రుద్రవీణ, అన్వేషణ, లేడీస్‌ టైలర్‌, ఏప్రిల్‌ 1 విడుదల, స్వర్ణకమలం చిత్రాల్లోని పాటలన్నీ సూపర్‌హిట్‌ అయ్యాయి. దాంతో తెలుగు, తమిళ్‌లో కూడా నెంబర్‌వన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. 

Also Read :  హఫీజ్ సయీద్ కొడుకుతో పాకిస్తాన్ స్పీకర్.. ఉగ్రవాదులతో లింకుల విషయంలో మరో సాక్ష్యం

హీరోలతో సమానంగా కటౌట్లు..

ఒక సంగీత దర్శకుడికి హీరోతో సమానంగా కటౌట్‌ పెట్టడం అనేది ఇళయరాజాతోనే మొదలైంది. అదికూడా రజనీ కాంత్ కటౌట్ తో సమానంగా ఇళయరాజా కటౌట్ పెట్టారంటే అర్థం చేసుకోవచ్చును ఆయనకు ఎంతమంది అభిమానులున్నారో. అందుకే ఈయనను ఇసైజ్ఞాని అంటారు. ఏడు వేలకు పైగా పాటలు… 1400 పై చిలుకు సినిమాలు… ఇరవై వేలకు పైగా కాన్సర్ట్స్… ఇన్ని చేయడం ఒకే ఒక్కరికి సాధ్యం. అది ఒక్క ఇళయరాజా సొంతం. స్టార్ ఆఫ్ స్టార్స్, కింగ్ ఆఫ్ మెలోడీ, మేస్ట్రో, ఇసై జ్ఞాని ఈ బిరుదులన్నీ ఆయనకే చెల్లు. ఉన్నవి ఏడే స్వరాలు. కానీ వాటిలతో ఇళయరాజా పలికించిన రాగాలెన్నో...వాటి మధురిమలు మరెన్నో. భారతీయ సంగీత దర్శకుడికీ సాధ్యం కాని సింఫోని కాన్సర్ట్‌ని అద్భుతంగా నిర్వహించి ప్రపంచ సంగీత కళాకారుల ప్రశంసలు అందుకున్నారు ఇళయరాజా. 1986లో ‘హౌ టు నేమ్‌ ఇట్‌’, 1988లో ‘నథింగ్‌ బట్‌ విండ్‌’ అనే ఇంగ్లీష్  ఆల్బమ్స్‌ను కూడా చేశారు. ఈయనను ఇప్పటికే భారత ప్రభుత్వం పద్మ భూషణ్, పద్మవిభూషణ్ లతో సత్కరించింది. 

Also Read: Pakistan: హఫీజ్ సయీద్ కొడుకుతో షెహబాజ్ షరీఫ్ సహాయకుడు.. ఉగ్రవాదుల విషయంలో మరో సాక్ష్యం

 

ilayaraja | birth-day | music-director | today-latest-news-in-telugu

 

Advertisment
Advertisment
తాజా కథనాలు