/rtv/media/media_files/2025/02/20/epGlbi4OTb4lLjlq3ham.jpg)
Gujarat Matrimoni case 15 Women Raping man arrest
Gujarat Rape Case: మ్యాట్రిమోని వెబ్ సైట్ కారణంగా మరో ఘోరం జరిగింది. వివాహ సంబంధాలు వెతుకుతున్న ఓ యవకుడు అమ్మాయిలను పరిచయం చేసుకుని దారుణానికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పదుల సంఖ్యలో అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుజరాత్ లో గత రెండున్నర సంవత్సరాలుగా ఈ తంతంగా నడుస్తుండగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు 26 ఏళ్ల వ్యక్తిని వాలివ్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.
నకిలీ ఫ్రొఫైల్స్ క్రియేట్ చేసి..
అహ్మదాబాద్ నివాసి అయిన హిమాన్షు యోగేష్ భాయ్ పంచల్ అనే 26ఏళ్ల యువకుడు మ్యాట్రిమోని ప్లాట్‌ఫామ్‌ల్లో నకిలీ ఫ్రొఫైల్స్ క్రియేట్ చేశాడు. అంతేకాదు తాను సైబర్ సెక్యూరిటీ విభాగానికి చెందిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ అధికారిగా నటిస్తూ మహిళలను ప్రలోభపెట్టాడు. చాలా ఆస్తులు కలిగిన ధనవంతుడిగా నమ్మించాడు. అతని మోసపూరిత ఆకర్షణకు మ్యాట్రిమోనియల్ సైట్‌లలో యువతులు అతనితో సంబంధాలు మొదలుపెట్టారు. ఒక్కొక్కరిని నమ్మించి ముంబై, అహ్మదాబాద్ హోటళ్లకు ఆహ్వానించేవాడు. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి, నకిలీ వజ్రాల ఆభరణాలను బహుమతిగా ఇచ్చి లైంగిక దాడికి పాల్పడేవాడు. ఆర్థిక, శారీరక ప్రయోజనాలు పొందిన తర్వాత బాధితులందరితో లింక్ తెంచుకునేవాడని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చూడండి: Aaryan Shukla: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?
వజ్రాల హారాలు బహుమతిగా..
అయితే మీరా రోడ్‌కు చెందిన 31 ఏళ్ల మహిళ ఫిబ్రవరి 6న వాలివ్ పోలీసులను సంప్రదించగా మోసగాడి నేరాల పరంపర వెలుగులోకి వచ్చింది. పంచల్ ఒక మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా తనను సంప్రదించి వజ్రాల హారాన్ని బహుమతిగా ఇచ్చి మోసం చేసినట్లు బాధితురాలు తెలిపింది. అహ్మదాబాద్‌లోని రెండు హోటళ్లలో అతను ఇలాంటి పనులు చేస్తున్నాడని వివరాలను అందించింది.
ఇది కూడా చదవండి: Kiran-laxmi: బలవంతంగా కామదాహం తీర్చుకున్నాడు.. ఆ నీచుడిని అరెస్టు చేయండి!
పంచల్ మృదువుగా మాట్లాడే తీరు, ఇంగ్లీష్ భాష అమ్మాయిలను అట్రాక్ట్ చేసినట్లు విచారణలో అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. 'అతను చాలా మధురంగా మాట్లాడతాడు. తన మంచి ఇంగ్లీషుతో మహిళలను ఆకట్టుకున్నాడు. 5 ఫోన్లు, ఒక ఆపిల్ ల్యాప్‌టాప్‌ను ఉపయోగించాడు. కమ్యూనికేషన్ కోసం ఎల్లప్పుడూ హోటల్ వైఫై, వాట్సాప్ ఉపయోగించాడు. అతని బాధితులు మరింత మంది ఉన్నట్లు తెలుస్తోంది. దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.