రాజలింగం హత్య వెనుక కేసీఆర్, కేటీఆర్, హరీశ్.. మంత్రి కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు!

రాజలింగం హత్య వెనుక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, గండ్ర వెంకటరమణారెడ్డి ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. హత్యా రాజకీయాలు కేసీఆర్ కు అలవాటేనన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేసి నిందితులకు వెంటనే శిక్ష వేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

New Update

రాజలింగం హత్యలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, గండ్ర వెంకటరమణ రెడ్డి పాత్ర ఉందని మంత్రి కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ దోపిడీని ప్రశ్నించిన రాజలింగాన్ని చంపేశారన్నారు. ఈ రోజు కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాజలింగ మూర్తి హత్యను తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ పార్టీ పదేళ్లలో హత్యా రాజకీయాన్ని పెంచి పోషించిందని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ తో పాటు ఐదుగురిపై సామాజిక కార్యకర్త రాజలింగం కోర్టులో కేసు వేశాడన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కేసీఆర్ కు దోషిగా శిక్ష పడుతుందని కేసీఆర్, కేటీఆర్ హత్య చేయించారని రాజలింగమూర్తి కూతురు,భార్య చెబుతోందన్నారు.
ఇది కూడా చదవండి: రాజలింగమూర్తి మర్డర్ వెనుక మేఘా?  .. కాళేశ్వరంపై కేసు వేసినందుకే ఖతం!

అడ్వకేట్ వామన రావు దంపతుల హత్యకు ఎవరు కరణమో అందరికీ తెలుసన్నారు. వరంగల్ లో ఎంపీడీఓను బీఆర్ఎస్ వాళ్లు హత్య చేశారని అప్పటి సీపీ రంగనాథ్ చెప్పారన్నారు. కొడంగల్ లో సాక్షాత్తు జిల్లా కలెక్టర్ పై కూడా సురేష్ అనే రౌడీ షీటర్ దాడి చేశాడన్నారు. తెలంగాణలో అభివృద్ధి జరగొద్దనేది బీఆర్ఎస్ లక్ష్యమన్నారు. కేసీఆర్ కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గిందని అంటున్నాడని.. మరి హత్యా రాజకీయాలు చేయడమే మీ గ్రాఫా? అని బీఆర్ఎస్ ను ప్రశ్నించారు కోమటిరెడ్డి. 
ఇది కూడా చదవండి: BIG BREAKING : భూపాలపల్లి హత్య ఘటనపై సీఎం రేవంత్ సీరియస్.. సంచలన నిర్ణయం!

హత్యా రాజకీయాలకు చోటు లేదు..

సీబీ సీఐడీ విచారణ చేసి 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేయాలన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేసి నిందితులకు వెంటనే శిక్ష వేయాలన్నారు. హత్యను సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ గా తీసుకుంటారన్నారు. లగచర్లలో లో కూడా కలెక్టర్ ను చంపాలని చూశారని ఆరోపించారు. తెలంగాణలో హత్యా రాజకీయాలకు తావు లేదని స్పష్టం చేశారు కోమటిరెడ్డి. అవినీతి మీద పోరాడే వారికి రక్షణ కల్పిస్తామని ప్రకటించారు. హరీష్ రావు అవినీతి మీద పోరాడుతున్న చక్రధర్ కూడా రక్షణ కల్పిస్తామన్నారు. తెలంగాణను దోచుకొని తిని ఎదురు తిరిగిన వాళ్ళను చంపేస్తారా? అంటూ ప్రశ్నించారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: ‘బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్’

సామ రాం మోహన్ రెడ్డి మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. BRS నుంచి కవితని సస్పెండ్ చేస్తారని చెప్పారు. కవిత లేఖ గురించి ఆయన 2 వారాల ముందే చెప్పారు. సామ రాం మోహన్ గాంధీభవన్‌లో మాట్లాడుతూ కవిత చెప్పిన దెయ్యాలు హరీశ్ రావు, KTR, సంతోష్ రావులే అని అన్నారు.

New Update
Kavitha

Kavitha

కాంగ్రెస్ లీడర్ సామ రాం మోహన్ రెడ్డి మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్‌లో చీలిక రాబోతుందని, కవిత కేసీఆర్‌కు లేఖ రాసిందని ఆయన రెండు వారాల ముందే చెప్పారు. ఆయన చెప్పినట్లే కవిత కేసీఆర్‌కు రాసిన లేఖ బయటపడింది. శనివారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మళ్లీ సెన్సెషనల్ కామెంట్స్ చేశారు. అలాగే ఆమె రాసిన లేఖపై శుక్రవారం వివరణ ఇస్తూ కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు ఉన్నాయని కవిత అన్నారు. ఆ దెయ్యాలు ఎవరో కూడా సామ రాం మోహన్ రెడ్డి చెప్పారు. సంతోష్ రావు, కేటీఆర్, హరీష్ రావులే కవిత చెప్పిన దెయ్యాలని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేయడమే వాళ్ల ప్లాన్ అని రాం మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు.

అలాగే కవిత లేఖ గురించి పది రోజుల ముందే తాను చెప్పానని గుర్తుచేశారు. నేడో, రేపో కవితని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారనన్నారు. సంతోష్‌ రావుని పార్టీ ప్రెసిడెంట్ చేసే అవకాశం కూడా ఉందని చెప్పారు. కేసీఆర్‌కు జయలలిత పరిస్థితి వచ్చిందన్నారు. కవితపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే ఆమె సొంత పార్టీ పెడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు.. కవితతో మాట్లాడి సమస్య పరిష్కరించుకునే ఆలోచన కేటీఆర్‌కి లేదని, సొంత మనుషులే కేసీఆర్‌ను వెన్నుపోటు పొడుస్తారని ఆయన అన్నారు. కుటుంబాన్ని విచ్చిన్నం చేసినా కేసీఆర్ నిస్సహాయుడిగా ఉన్నారు. పార్టీ అంతర్గత విషయాలను బయట మాట్లాడితే గతంలో అనేకమందిపై కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. కేసీఆర్‌తో కవిత మాట్లాడతా అంటే సంతోష్ అడ్డుకున్నాడని సామ రాం మోహన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఏం చేయాలో, ఎవర్ని కలవాలో సంతోష్ రావు డిసైడ్ చేస్తున్నారు. కేసీఆర్ దర్శనానికి ఎమ్మెల్యేల దగ్గర సంతోష్ రావు డబ్బులు తీసుకుంటాడని ఆయన ఆరోపించాడు.

Sama Ram Mohan Rao | kavitha | brs | telangana | congress | latest-telugu-news

Advertisment
Advertisment
Advertisment