/rtv/media/media_files/2025/07/07/kaveri-river-2025-07-07-17-40-12.jpg)
కర్ణాటకలో దారుణం జరిగింది. విహార యాత్ర కాస్త విషాద యాత్రగా మిగిలింది. మాండ్య జిల్లాలోని కావేరి నదిలో ఆదివారం సాయంత్రం ఫోటో తీయడానికి ప్రయత్నిస్తూ 36 ఏళ్ల ఓ వ్యక్తి అందులో పడి కొట్టుకుపోయాడు. మైసూరుకు చెందిన మహేష్ అనే ఆటో డ్రైవర్ శ్రీరంగపట్నంలోని సర్వ ధర్మ ఆశ్రమం సమీపంలోని కృష్ణ రాజ సాగర్ (KRS) ప్రాంతానికి స్నేహితులతో కలిసి విహారయాత్రకు వచ్చాడు.
అయితే అక్కడ మహేష్ ఫోటోలకు కోసం పోజులిచ్చేటప్పుడు ప్రమాదవశాత్తు జారిపడి నదిలో పడిపోయాడు. నీటి మట్టం ఎక్కువగా ఉండటం, ప్రవాహం కూడా బలంగా ఉండటంతో అతను అందరూ చూస్తుండగానే కొట్టుకుపోయాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసుల, సహా రెస్క్యూ బృందాలు సంఘటన స్థలంలో గాలింపు చర్యలు చేపట్టాయి. తమతో విహారయాత్రకు వచ్చిన స్నేహితుడికి ఇలా జరగడం తోటి స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Also Read : రీల్స్ కోసం ఎంతకు తెగించార్రా... ఏకంగా రైలు పట్టాలపై పడుకొని...
Also Read : అమ్మో.. రామాయణ సినిమాకు రణ్‌బీర్ కపూర్ అన్ని కోట్లు తీసుకుంటున్నాడా ?
వంతెనను వాహనం ఢీకొట్టడంతో
ఆదివారం మండ్య జిల్లాలో జరిగిన మరో సంఘటనలో కొప్ప పోలీస్ స్టేషన్ పరిధిలోని విశ్వేశ్వరయ్య కాలువపై ఉన్న వంతెనను వాహనం ఢీకొట్టడంతో మోటార్ సైకిల్‌పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో వంతెన దాటుతుండగా రైడర్ నియంత్రణ కోల్పోయి రెయిలింగ్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఇద్దరూ కాలువలో పడి అక్కడికక్కడే మరణించారు. ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసి, పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
Also Read : దంచికొడుతున్న వర్షం..ఆ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్
Also Read : నాకు గొర్రెలు, బర్రెల శాఖలిస్తే ఏం చేసుకోవాలి.. మంత్రి వాకిటి సంచలన కామెంట్స్!
rescue-team | cauvery-river | photos | karnataka | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | telugu crime news | national news in Telugu