Shocking: కుక్క ఫ్యామిలీకి రెసిడెన్సీ సర్టిఫికెట్‌.. ఎక్కడో తెలిస్తే షాక్!

బీహార్‌లో పట్టణ అధికారులు ఓ కుక్కకు రెసిడెన్స్‌ సర్టిఫికెట్‌ జారీచేయటం రాజకీయంగా తీవ్ర దుమారానికి దారితీసింది. పట్నా జిల్లాకు చెందిన మాసౌర్హీ టౌన్‌ అధికారుల నుంచి ‘డాగ్‌ బాబు’ అనే పేరుతో డిజిటల్‌ రూపంలో రెసిడెన్స్‌ సర్టిఫికెట్‌ జారీ అయ్యింది.

New Update
Residency certificate for dog

బీహార్‌లో పట్టణ అధికారులు ఓ కుక్కకు రెసిడెన్స్‌ సర్టిఫికెట్‌ జారీచేయటం రాజకీయంగా తీవ్ర దుమారానికి దారితీసింది. పట్నా జిల్లాకు చెందిన మాసౌర్హీ టౌన్‌ అధికారుల నుంచి ‘డాగ్‌ బాబు’ అనే పేరుతో డిజిటల్‌ రూపంలో రెసిడెన్స్‌ సర్టిఫికెట్‌ జారీ అయ్యింది. ఆ కుక్క తండ్రి పేరు కుత్తా బాబు, తల్లి పేరు కుత్తియా దేవి, అడ్రస్‌తో ఉన్న రెసిడెన్స్‌ సర్టిఫికెట్‌ ప్రభుత్వ పోర్టల్‌లో అందరికీ అందుబాటులో ఉంచారు.

దీన్ని బట్టి అర్థం అవుతుంది బిహార్ అధికారులు ఏ స్థాయిలో పని చేస్తున్నారో అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఫొటోలో ఉన్నది ఓ కుక్క అన్న సంగతి చూసుకోకుండా ప్రభుత్వం దానికి ఓ రెసిడెన్స్‌ సర్టిఫికెట్‌ జారీచేయటంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఆ రెసిడెన్సీ సర్టిఫికేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బీజేపీ పాలనలో లోపభూయిష్టమైన వ్యవస్థకు ఇది నిదర్శమని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి సర్టిఫికెట్‌ను ఆమోదిస్తూ బీహార్‌ ఓటర్ల సర్వేను నిర్వహిస్తున్నారని, ఆధార్‌, రేషన్‌ కార్డులను లెక్కలోకి తీసుకోవటం లేదని స్వరాజ్‌ ఇండియా సభ్యుడు యోగేంద్ర యాదవ్‌ Xలో ఆరోపించారు.

Advertisment
తాజా కథనాలు