BIG BREAKING: నిమిష ప్రియా ఉరిశిక్ష రద్దు

యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్నకేరళ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు చేసేందుకు యెమెన్‌ అధికారులు నిర్ణయించారు. సోమవారం ఈ నిర్ణయం వెలువడింది. ఈ మేరకు భారత గ్రాండ్‌ ముఫ్తీ, సున్నీ లీడర్‌ కాంతపురం ఏపీ అబూబకర్‌ ముస్లియార్‌ కార్యాలయం నుంచి ఈ ప్రకటన చేశారు.

New Update
Nimisha Priya

Nimisha Priya

యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్నకేరళ నర్సు నిమిష ప్రియకు భారీ ఊరట లభించింది. ఆమె ఉరిశిక్ష రద్దు చేసేందుకు యెమెన్‌ అధికారులు నిర్ణయించారు. సోమవారం అర్ధరాత్రి ఈ నిర్ణయం వెలువడింది. ఈ మేరకు భారత గ్రాండ్‌ ముఫ్తీ, సున్నీ లీడర్‌ కాంతపురం ఏపీ అబూబకర్‌ ముస్లియార్‌ కార్యాలయం నుంచి ఈ ప్రకటన చేశారు. అయితే భారత విదేశాంగ శాఖ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ నిర్ణయానికి ముందు యెమెన్‌ రాజధాని సనాలో అత్యున్నత సమావేశం జరిగింది. ఈ భేటీలో ఉత్తర యెమెన్‌ అధికారులు, అంతర్జాతీయ దౌత్య ప్రతినిధులు పాల్గొన్నట్లు సమాచారం. 

నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దుకోసం భారత గ్రాండ్‌ ముఫ్తీ విజ్ఞప్తి మేరకు యెమెన్‌లోని సూఫీ ముఖ్య పండితుడు అయిన షేక్‌ హబీబ్‌ ఒమర్‌ బిన్‌ హఫీజ్‌ ఒక బృందాన్ని చర్చల ఏర్పాటు చేశారు. అలాగే అబుబాకర్‌ ముస్లియార్‌ ఉత్తర యెమెన్‌ ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వం జరిపారు. దీంతో చర్చలు ఫలించడంతో ఆమె ఉరిశిక్ష రద్దుకు యెమెన్‌ అంగీకరించినట్లు ముఫ్తీ కార్యాలయం తెలిపింది. మత పెద్దల చొరవతోనే నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు అయినట్లు పేర్కొన్నారు. అయితే ఆమె విడుదలపై ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు. నిమిష ప్రియ జైలు నుంచి విడుదల కావడమా లేదా జీవితఖైదు పడే అవకాశం ఉందా అనేది తెలియదన్నారు. అయితే మరణించిన యెమెన్‌ పౌరుడు తలాల్‌ మహదీ కుటుంబ సభ్యులతో చర్చల అనంతరం తదుపరి నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు