Wife Murder: హైదరాబాద్ మలక్‌పేట్‌లో మరో గురుమూర్తి.. భార్యను చంపి ఏం చేశాడంటే!

హైదరాబాద్‌లో మరో గురుమూర్తి ఘటన జరిగింది. ఓల్డ్ మలక్‌పేట్‌ జమున టవర్స్లో నివాసం ఉంటున్న వినయ్ కుమార్ తన భార్య శిరీషను హతమార్చి గుండెపోటుతో చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. శిరీష పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.

New Update
hydebarad murder

Hydebarad malakpet murder case

Hyderabad murder: హైదరాబాద్‌లో మరో గురుమూర్తి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చాదర్ఘాట్ పరిధిలో భార్యను దారుణంగా టార్చర్ చేసి హతమార్చిన ఓ భర్త.. ఆ తర్వాత ఆమె గుండె పోటుతో చనిపోయిందంటూ డ్రామా మొదలుపెట్టాడు. అంతేకాదు ఆమె కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరకోకముందే అంబులెన్సులో మృతదేహాన్ని  సొంత గ్రామం  తరలిస్తుండగా అడ్డంగా బుక్ అయ్యాడు. ఈ ఘటన ఓల్డ్ మలకపేటలోని జమున టవర్స్‌లో జరగగా స్థానికులంతా ఉలిక్కిపడ్డారు. మృతురాలి ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేయగా విచారణలో భయంకర నిజాలు బయటపడ్డాయి. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 

ఇంట్లోనే చనిపోయిందంటూ..

శ్రీశైలం సమీపంలోని దోమల పెంటకు చెందిన శిరీష, వినయ్ కుమార్ అనే దంపతులు ఓల్డ్ మలకపేట జమున టవర్స్లో నివాసం ఉంటున్నారు. అయితే ఆదివారం శిరీషకు గుండెపోటు వచ్చి ఇంట్లోనే చనిపోయిందంటూ ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు వినయ్. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పేరెంట్స్.. మృతదేహంపై గాయాలు కనిపించడంతో కొట్టి చంపినట్లు గుర్తించారు. గుండెపోటు అని కథ అల్లుతున్నాడంటూ వెంటనే చాదర్ ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Also Read: నట్టు, బోల్ట్ బిగించాల్సిందే.. రష్మికపై కాంగ్రెస్ ఎమ్మెల్యే బోల్డ్ కామెంట్స్!

అయితే వినయ్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిజంగానే గుండెపోటుతో ఆమె చనిపోయిందా లేక వినయ్ ఆమెను కొట్టి చంపేశాడ అనేది దర్యాప్తులో వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. 

Also Read: రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ పోస్టు .. డిలీట్ చేసిన ముస్లిం మహిళా నేత!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు