/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-92-jpg.webp)
Gujarat Minor girl raped in Dharamsala
గుజరాత్‌లో ఘోరం జరిగింది. సూరత్‌లోని ధర్మశాలలోని జైన సన్యాసి మైన్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఈ ఘటన 7ఏళ్ల క్రితం జరగగా సన్యాసికి10 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ మేరకు ధర్మశాలకు చెందిన కళాశాలలోని 19ఏళ్ల విద్యార్థినిపై అత్యాచారం చేసిన కేసులో జైన దిగంబర్ శాఖకు చెందిన సన్యాసికి సూరత్‌లోని సెషన్స్ కోర్టు శనివారం 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అత్యాచారం కేసులో శాంతిసాగర్ జీ మహారాజ్ దోషిగా తేలడంతో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి ఏకే షా నిందితుడికి రూ.25 వేల రూపాయల జరిమానా కూడా విధించారు.
Also Read : యూకే ఎంపీలను నిర్బంధించిన ఇజ్రాయెల్!
మౌనంగా ఉండాలని బెదిరించి..
ఈ సంచలనాత్మక అత్యాచార సంఘటన 2017 అక్టోబర్‌లో ఇక్కడి జైన్ ధర్మశాలలో జరిగింది. కాగా బాలిక, ప్రాసిక్యూషన్ సాక్షుల వాంగ్మూలాలతో పాటు, వైద్య నివేదిక, సీసీటీవీ ఫుటేజీలను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నయన్ సుఖద్వాలా తెలిపారు. ఇక నిందితుడు జైన్ ముని బాధితురాలి తండ్రి, సోదరుడిని వేర్వేరు గదుల్లో కూర్చోబెట్టాడు. మంత్రాలు జపిస్తూ కొన్ని ఆచారాలు నిర్వహించారు. తాను అనుమతి ఇచ్చే వరకు బయటకు రావద్దని వారికి చెప్పాడు. బాధితురాలు ఒంటరిగా కూర్చున్న గదికి వెళ్ళాడు. బలవంతంగా బాధితురాలిపై కామావాంఛ తీర్చుకున్నాడు. ఆమెను మౌనంగా ఉండాలని బెదిరించారు. నిరసన వ్యక్తం చేస్తే తన కుటుంబ సభ్యులు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని భయపెట్టాడు. తాను ఎప్పుడు పిలిచినా వచ్చి తనను కలవాల్సిందేనని ఆదేశించాడని విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు.
Also Read : ప్రభాస్ ఇంటి పక్కన రూ.8 కోట్ల విల్లా.. అఘోరీ ఆస్తులు బయటపెట్టిన వర్షిణీ పేరెంట్స్!
ఇది కూడా చూడండి: Tractor accident: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి
ఇదిలా ఉంటే.. బెంగళూర్‌లో మరో దారుణం జరిగింది. మైనర్ బాలికపై బ్యాడ్మింటన్ కోచ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. BGLRలో 8మంది ట్రైనీ అమ్మాయిల న్యూడ్ ఫొటోలు తీసినట్లు గుర్తించి పోలీసులు సురేశ్ బాలాజీని అరెస్ట్ చేశారు.
ఇది కూడా చూడండి: Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!
minor-girl | rape-case | gujarath | latest-telugu-news | today-news-in-telugu | breaking news telugu | national news in Telugu | telugu crime news