Sri Varshini - Aghori: ప్రభాస్ ఇంటి పక్కన రూ.8 కోట్ల విల్లా.. అఘోరీ ఆస్తులు బయటపెట్టిన వర్షిణీ పేరెంట్స్!

వర్షిణీ పేరెంట్స్ అఘోరీ ఆస్తులకు సంబంధించి షాకింగ్ విషయాలు బయటపెట్టారు. ‘అఘోరీ స్మశానంలో పెద్ద పెద్ద వాళ్లకోసం పూజలు చేస్తుంది. అలా రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలు వసూళు చేస్తుంది. అలాగే ప్రభాస్ ఇంటి పక్కన రూ.8 కోట్ల విలువైన విల్లా ఉంది’ అని చెప్పుకొచ్చారు.

New Update
Sri Varshini Parents Sensational Comments on Lady Aghori Assets.

Sri Varshini Parents Sensational Comments on Lady Aghori Assets

అఘోరీ వ్యవహారం రచ్చకెక్కింది. వర్షిణీ తల్లిదండ్రులు అఘోరీపై తీవ్ర ఆరోపణలు చేశారు. క్షుద్రపూజలు చేసి.. వర్షిణీని అఘోరీ వశపరచుకుందని అంటున్నారు. ఇటీవలే గుజరాత్‌లో అఘోరీతో ఉన్న వర్షిణీని ఆమె అన్నయ్యలు పట్టుకుని ఇంటికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో వర్షిణీ ఫ్యామిలీని RTV ఛానెల్ సంప్రదించగా.. వారు అఘోరీ గురించి షాకింగ్ విషయాలు చెప్పారు. 

ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

అఘోరీకి డబ్బులు

ముఖ్యంగా అఘోరీకి డబ్బులు ఎలా వస్తున్నాయి?.. ఎంత వస్తున్నాయి?.. ఆమెకు ఆస్తులు ఉన్నాయా? లేదా? అనే దాని గురించి షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. తనకు డబ్బులు ఎలా వస్తాయి అనేది అఘోరీ తమకు చెప్పిందని వారు అన్నారు. ఈ మేరకు వర్షిణీ పేరెంట్స్ మాట్లాడుతూ.. తాను స్మశానంలో పూజలు చేస్తానని.. మినిమం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఇవ్వనిదే తాను డీల్ కుదుర్చుకోనని అఘోరీ చెప్పిందని అన్నారు. 

ఇది కూడా చూడండి: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

ఇది కూడా చూడండి: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

ప్రభాస్ ఇంటి పక్కన విల్లా

ఆ పూజలు కేవలం బడా బడా వ్యక్తులకే చేస్తానని.. చిన్న చిన్న వారికి చేయనని అఘోరీ చెప్పినట్లు వారు తెలిపారు. అలాగే యూట్యూబ్ ద్వారా రూ.20 లక్షలు వస్తాయని అఘోరీ వారితో చెప్పినట్లు వారు పేర్కొన్నారు. అది మాత్రమే కాకుండా తనకు హైదరాబాద్‌లో ప్రభాస్ ఇంటి పక్కన పెద్ద విల్లా ఉందని కూడా ఆమె చెప్పిందని.. దాని విలువ దాదాపు రూ.8 కోట్లు ఉంటుందని కూడా అఘోరీ వారితో చెప్పినట్లు వర్షిణీ పేరెంట్స్ తెలిపారు. 

ఇది కూడా చూడండి: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

(lady aghori | sri varshini | aghori sri varshini | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు