/rtv/media/media_files/2025/10/07/husband-hangs-himself-after-killing-his-wife-for-illegal-affair-2025-10-07-10-22-02.jpg)
Husband Hangs Himself After Killing His Wife for Illegal Affair
ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాల(Illegal Affair Incident) వ్యవహారాలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రియుడి కోసం కట్టుకున్నవాడిని కడతేర్చుతున్నారు(Wife Illigal Affair Viral News). కుటుంబం, పిల్లలు, పరువు పక్కన పెట్టి ప్రియుడితో కొందరు జంప్ అవుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. అయితే ఇక్కడ భర్త చేతిలో భార్య ప్రాణాలు కోల్పోయింది. భార్య వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అతడితో డైలీ ఫోన్లో మాట్లాడేది. పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పేది. ఈ విషయం భర్తకు తెలియడంతో అతడు చిర్రెత్తిపోయాడు. ఏం చేయాలో భర్తకు అర్థం కాలేదు. ఒకవైపు చూస్తే పిల్లలు, మరోవైపు చూస్తే పరువు.. ఆలోచించి ఆలోచించి భార్యను చంపేయాలని నిశ్చయించుకున్నారు. అనుకున్నట్లుగానే అందరూ పడుకున్న తర్వాత స్కార్ఫ్‌తో గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత అతడు అదే స్కార్ఫ్‌తో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘోరమైన ఘటన కాన్పూర్‌లోని బంబురిహా గ్రామంలో చోటుచేసుకుంది పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read : నెల్లూరులో జంట హత్యలు.. రంగంలోకి పోలీసు జాగిలాలు
Kanpur Wife Illegal Affair
కాన్పూర్ జిల్లాలోని బంబురిహా గ్రామానికి చెందిన బాబురామ్ 2009లో షాపూర్‌కు చెందిన నాంకిని వివాహం చేసుకున్నాడు. వారికి చందన్, లాలి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆ తర్వాత తొమ్మిది సంవత్సరాల క్రితం నాంకి అతన్ని విడిచిపెట్టేసింది. అనంతరం బాబూరామ్ మహారాజ్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని సర్సౌల్‌కు చెందిన శాంతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు అంకుష్, అర్పిత్.. అలాగే నిత్య అనే కుమార్తె ఉన్నారు. కొంతకాలం పాటు పిల్లా పాపలతో పరిస్థితులు బాగానే సాగాయి.
కానీ క్రమంగా వారి మధ్య సంబంధం దూరమైంది. గత రెండు నెలలుగా శాంతి ఘటంపూర్‌కు చెందిన ఒక యువకుడితో ఫోన్‌లో చాలా సేపు మాట్లాడటం మొదలు పెట్టింది. అలా ఓ రోజు ఆమె తన ప్రియుడితో మాట్లాడుతూ.. త్వరలో వివాహం చేసుకుందాం అని చెప్పింది. ఆ మాటల్ని భర్త బాబూరామ్ విన్నాడు. అనంతరం ఆమెను ప్రశ్నించాడు. ‘‘నా మొదటి భార్యను విడిచిపెట్టిన తర్వాత నేను నిన్ను దత్తత తీసుకున్నాను. నేను ముగ్గురు పిల్లల తండ్రిని. మీరు మూడో పెళ్లి గురించి మాట్లాడుతున్నారా?’’ అని అడిగాడు. ఆమె బదులిస్తూ.. ‘‘నాకు మీతో జీవించడం ఇష్టం లేదు. నేను అతన్ని వివాహం చేసుకుంటాను.’’ అని భర్తకు సమాధానం ఇచ్చింది.
భార్య మాటలతో బాబూరామ్ హృదయం ముక్కలైంది. దీంతో వీరి మధ్య గొడవ చెలరేగింది. అనంతరం గొడవ చల్లారాక భోజనం చేసి అందరూ నిద్రపోయారు. కానీ బాబూరామ్‌కు మాత్ర నిద్ర పట్టలేదు. ఎలాగైనా తన భార్యను చంపాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అర్థరాత్రి సమయంలో నిద్రపోతున్న భార్య శాంతి గొంతును స్కార్ఫ్‌తో నులిమి చంపేశాడు. ఆ తర్వాత బాబూరామ్ సైతం అదే స్కార్ఫ్‌తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మృతురాలి కుమార్తె ఉదయం లేచి చూసే సరికి తల్లి నేలపై చనిపోయి కనిపించింది. అదే సమయంలో తండ్రి దూలానికి వేలాడుతూ కనిపించడంతో ఉక్కిరిబిక్కిరి అయింది. గట్టిగా అరుపులు అరిచింది. వెంటనే చుట్టుపక్కల వారు వచ్చి చూసి షాకయ్యారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. వారు కేసు నమోదు చేసుకుని మృతులను పోస్టుమార్టంకు పంపించారు.
Also Read : పెళ్లి పేరుతో మోసం.. టీచర్ కు రూ.2.5 కోట్లు కుచ్చుటోపి