/rtv/media/media_files/2025/10/12/nda-finalises-bihar-seat-sharing-deal-2025-10-12-20-13-26.jpg)
NDA finalises Bihar seat-sharing deal, BJP and JDU to contest 101 seats each
బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు(bihar-assembly-elections) జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారంలోకి దిగాయి. ఎన్డీయే కూటమి, మహాగఠ్ బంధన్ కూటమిల మధ్య గట్టి పోటీ ఉండనుంది. ఈ క్రమంలోనే అధికార NDA కూటమిలో సీట్ల సర్దుబాటు జరిగింది. బీజేపీ 101 స్థానాల్లో పోటీ చేయనుంది. జేడీయూ కూడా 101 స్థానాల్లో బరిలోకి దిగనుంది. ఇక కేంద్రమంత్రి చిరాగ్ పాసవాన్ నేతృత్వంలోని లోక్ జన్‌శక్తి పార్టీ 29 స్థానాల్లో పోటీ చేయనుంది. హిందూస్థానీ అవామ్ మోర్చా, రాష్ట్రీయ లోక్‌మోర్చా పార్టీలకు చెరో ఆరు స్థానాలు కేటాయించారు.
Also Read: నువ్వేం తండ్రివి రా.. భార్య విడిచి వెళ్లిందనే కోపంతో ముగ్గురు పిల్లలను గొంతు కోసి హత్య
NDA Finalises Bihar Seat-Sharing Deal
కూటమి పక్షాలు ఈ సర్దుబాటును కూడా స్వాగతించినట్లు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఇదిలాఉండగా బీహార్‌లో 243 స్థానాలున్న సంగతి తెలిసిందే. నవంబర్ 6, 11 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 2-020 ఎన్నికల్లో బీజేపీ 110 సీట్లలో పోటీ చేయగా.. జేడీయూ 11 స్థానాల్లో బరిలోగి దిగింది. ఈసారి మాత్రం రెండు పార్టీ సమానంగా సీట్లు పంచుకున్నాయి.
#BreakingNews | NDA finalises seat sharing pact for the Bihar elections; BJP and JDU to contest 101 seats each@DhantaNews and @payalmehta100 share more details @_pallavighosh | #BiharElections2025#Politics#Indiapic.twitter.com/8o0HAAtaB7
— News18 (@CNNnews18) October 12, 2025
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా లోక్‌జన్‌శక్తి పార్టీ (LJP) 22 సీట్లలో పోటీ చేసింది. ఈసారి మాత్రం 29 స్థానాల్లో బరిలోగి దిగనుంది. ఇక విపక్ష కూటమి అయిన మహాగఠ్‌బంధన్‌లో మాత్రం ఇంకా సీట్ల సర్దుబాటు జరగలేదు. ఇంకా వీటిపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే RJP 135 నుంచి 140 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ 70 స్థానాలు కావాలని అడుగుతుండగా 50 నుంచి 52 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
Also Read : మెడికల్ స్టూడెంట్ పై అత్యాచారం.. సీఎం సంచలన కామెంట్స్
Follow Us