/rtv/media/media_files/2025/10/11/crime-2025-10-11-18-39-34.jpg)
Crime
తమిళనాడు(tamilnadu) లోని తంజావూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందనే కోపంతో భర్త తన ముగ్గురు పిల్లలను గొంతు కోసం చంపేశాడు(Father Killed Childrens). ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని మదుక్కూర్ సమీపంలో గోపాలసముద్రం ప్రాంతానికి చెందిన వినోద్‌కుమార్(38)కు నిత్య(34) అనే మహిళతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వినోద్ కమార్ డ్రైవర్‌గా అలాగే ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు.
Also Read: మెడికల్ స్టూడెంట్ పై అత్యాచారం.. సీఎం సంచలన కామెంట్స్
Man Hacks 3 Kids To Death
ఈ దంపతులకు ఓవియా(12), కీర్తి(8), ఈశ్వరన్(5) ముగ్గురు పిల్లలున్నారు. అయితే నిత్యకు తిరువారూర్ జిల్లా మన్నార్‌కుడికి చెందిన ఓ వ్యక్తితో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. దీంతో ఆరు నెలల క్రితం ఆమె తన భర్త, పిల్లలను వదిలేసి ఆ వ్యక్తితో వెళ్లిపోయింది. కొన్నిరోజుల క్రితమే వినోద్ భార్యను కలిశాడు. ఇంటికి తిరిగి రావాలని కోరాడు. కానీ ఆమె అందుకు ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన వినోద్ శుక్రవారం పిల్లలకు స్వీట్లు ఇచ్చి తినాలని చెప్పాడు.
Also Read: రాహుల్ గాంధీకి పట్టిన గతే తేజస్వీకి పడుతుంది.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు
పిల్లలను వాటిని తింటుండగానే ఆ ముగ్గురు గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ చిన్నారులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత వినోద్ మదుక్కూర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటన అక్కడ స్థానికంగా సంచలనం రేపింది. వినోద్ చేసిన పనిని అక్కడివారు తీవ్రంగా ఖండించారు. భార్య మీద కోపం పిల్లల మీద చూపించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: గ్రీన్ క్రాకర్స్ కు సుప్రీం గ్రీన్ సిగ్నల్..సిద్ధమవుతున్న ఢిల్లీ
Follow Us