Drugs: లేడీ కానిస్టేబుల్ కారులో డ్రగ్స్.. తర్వాత ఏం జరిగిందంటే?

యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో ఓ లేడీ కానిస్టేబుల్ కారులో డ్రగ్స్ దొరికాయి. అమన్‌దీప్ కౌర్‌ ప్రయాణిస్తున్న కారులో 17.71 గ్రాముల హెరాయిన్‌‌తో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపబడింది. ఉన్నతాధికారులు ఆమెను అరెస్ట్ చేసి, సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు.

New Update
women constable drugs

women constable drugs Photograph: (women constable drugs)

Drugs: రూల్స్ సామాన్యులకేనా.. పోలీసులకు వర్తించవన్నట్లుగా ఓ లేడీ కానిస్టేబుల్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. డ్రగ్స్ నిర్మూలించాల్సిన పోలీసులే యథ్దేచ్చగా వారి వాహనాల్లో డ్రగ్స్ తరలిస్తున్నారు. ఈ ఘటన పంజాబ్‌లోని బటిండాలో చోటుచేసుకుంది. చెకింగ్ పాయింట్‌లో ఉన్న మహిళా కానిస్టేబుల్ కారును ఆపి చూసిన పోలీసులు కంగుతిన్నారు. ఆ రాష్ట్రంలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా స్పెషల్‌ డ్రైవ్‌ చేపడుతున్నారు. ఇందులో భాగంగా మహిళా పోలీస్‌ కానిస్టేబుల్ అమన్‌దీప్ కౌర్‌ తన వాహనంలో డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు సమాచారం అందింది.

Also read: Congress MLA CPR: కాంగ్రెస్ కార్యకర్తకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే (VIDEO)

Also read: urine: నా మూత్రం తాగడం వల్లే నేను ఆరోగ్యంగా ఉంటున్నా.. ఎలాగంటే?

Also read: Waqf Bill: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టుకు కాంగ్రెస్ పార్టీ

గేర్‌ బాక్స్‌ వద్ద దాచిన హెరాయిన్‌..

పోలీసులు, యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది కలిసి కౌర్‌ డ్రైవ్‌ చేస్తున్న వాహనాన్ని భటిండాలోని బాదల్ ఫ్లైఓవర్ సమీపంలో అడ్డగించారు. తనిఖీ చేయగా గేర్‌ బాక్స్‌ వద్ద దాచిన 17.71 గ్రాముల హెరాయిన్‌ లభించింది. ఈ నేపథ్యంలో ఆ మహిళా కానిస్టేబుల్‌ను అరెస్ట్‌ చేశారు. అలాగే నిబంధనల ప్రకారం పోలీస్‌ ఉద్యోగం నుంచి ఆమెను తొలగించారు. అమన్‌దీప్ కౌర్‌కు మహేంద్ర థార్‌తోపాటు ఆడి, 2 ఇన్నోవా కార్లు, బుల్లెట్ బైక్‌, 2 కోట్ల విలువైన లగ్జరీ ఇల్లు, ఖరీదైన వస్తువులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆమె డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ చేస్తోందా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు