/rtv/media/media_files/2025/08/15/a-man-flung-his-son-from-rooftop-in-uttarpradesh-2025-08-15-20-25-12.jpg)
A Man Flung his Son From Rooftop in Uttarpradesh
ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు భార్యభర్తల మధ్య హత్యలకు దారితీస్తున్నాయి. తాజాగా ఓ భర్త తన భార్యపై అనుమానంతో కొడుకును మేడపై నుంచి తోసేశాడు. దీంతో ఆ బాలుడు అక్కడిక్కడే మృతి చెందడం కలకలం రేపింది. ఈ దుర్ఘటన ఉత్తరప్రదేశ్‌లోని చిటౌవ అనే గ్రామంలో చోటుచేసుకుంది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని చిటౌవ గ్రామంలో రాజ్ బహదూర్ అనే వ్యక్తి ఉంటున్నాడు. ఇతడికి ఏడేళ్ల క్రితం యుమునావతి అనే మహిళతో వివాహం జరిగింది.
Also Read: ఫామ్‌హౌజ్‌ల్లో బంచిక్ బం...అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా నగర శివార్లు
ఈ దంపతులకు అంకుశ్, లలిత్(2) అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే రాద్ బహదూర్ తన భార్యకి వివాహేతర సంబంధం ఉన్నట్లు తరచూ అనుమానించేవాడు. ఈ విషయంలో వీళ్లిద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఓసారి అతడు తన భార్యపై కత్తితో కూడా దాడి చేశాడు. గురువారం మద్యం సేవించేందుకు భార్యను డబ్బులు అడగగా ఆమె ఇవ్వలేదు. దీంతో ఇద్దరి మధ్య మళ్లీ ఘర్షణ చెలరేగింది. ఆమె ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. దీంతో తీవ్రంగా ఆగ్రహించిన రాజ్.. తన రెండేళ్ల కొడుకు లలిత్‌ను తీసుకుని మేడపైకి తీసుకెళ్లాడు. అక్కడ ఆ బాబుకు పురుగుల మందును బలవంతంగా తాగించి మేడపై నుంచి ఏమాత్రం కనికరం లేకుండా తోసేశాడు.
Also Read: మరో దారుణం.. పార్టీకి పిలిచి 24 ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్
ఆ బాలుడిని గమనించిన స్థానికులు ఒక్కసారిగా షాకైపోయారు. హుటాహుటినా అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆ బాలుడు మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ పరిశీలించారు. అనంతరం బాలుడి మృత దేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే రాజ్‌ను పోలీసులు అరెస్టు చేసేందుకు వెళ్లగా అతడు కత్తితో పొడుచుకుంటానంటూ బెదిరించారు. చివరికి స్థానికుల సాయంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకోన్నారు. భర్తపై కేసు నమోదు చేసిన భార్య.. కఠినంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది.
Also Read: బెంగళూరులో ఘోర అగ్ని ప్రమాదం.. సిలిండర్ పేలి స్పాట్‌లోనే 10 మందికి..