/rtv/media/media_files/2025/08/15/farmhouses-anti-social-activities-2025-08-15-20-08-46.jpg)
Farmhouses anti-social activities
Hyderabad Farmhouses: ఫామ్ హౌస్ అంటే ఒక కుటంబం సేద తీరడానికి వినియోగించుకునే పకృతి విడిదిలాంటి ప్రదేశం. కానీ, ఇప్పుడు దాని అర్థమే మారిపోయింది. అసాంఘీక కార్యకలాపాలకు ఫామ్‌హౌస్‌లు అడ్డాగా మారాయి. మూడు రేవ్ పార్టీలు, ఆరు మందు పార్టీలు అన్నట్లు ఫామ్ హౌజ్‌ల నిండా అవే కార్యక్రమాలు. పోలీసులు ఎన్నిసార్లు దాడులు చేసి పలువురిని అరెస్ట్ చేసి కేసులు పెడుతున్నా ఫామ్ హౌస్ యజమాన్యాల తీరు మారటం లేదు.
Also Read: మరికాసేపట్లో ట్రంప్-పుతిన్ భేటీ.. భారత్‌కు షాక్ ఇవ్వనున్నారా ?
హైదరాబాద్ శివారు ఫామ్‌హౌస్‌ల నిండా లిక్కర్ అండ్ రేవ్ పార్టీలే సాగుతున్నాయి. ఇంకా కొన్ని ఫామ్‌హౌజ్‌లైతే.. కిడ్నాప్, మర్డర్, కోళ్ల పందాలు, క్యాసినోలకు నిలయాలుగా మారాయి... ఇవన్నీ మచ్చుకు మాత్రమే. పోలీసుల కళ్లు గప్పి జరిగే పార్టీలకు కొదవే లేదు. . కోడిపందాలు, క్యాసినోల వ్యవహారాలు లెక్కేలేదు. అన్ని నేరాలకు ఫామ్‌హౌస్‌లు నిలయంగా నిలుస్తున్నాయి. నిజానికి నగరం శివార్లలో వెయ్యికి పైగా ఫామ్‌హౌస్‌లు ఉన్నాయి. వాటిల్లో రోజు ఏదో ఒక పార్టీ జరుగతూనే ఉంటుంది. అయితే ఏదైనా గొడవ జరిగినపుడు కానీ, అక్కడ వారు సౌండ్ పెట్టి హంగామా చేసినపుడు కానీ, పోలీసుల దృష్టికి పోతుంది. ఒక వేళ ఎవరూ ఫిర్యాదు చేయకపోతే కథ కంచికే. నిన్నటివరకు స్థానికులు మాత్రమే ఈ దందాలో దొరకగా తాజాగా విదేశీయులు పట్టుబడటం కలకలం రేపింది. అది కూడా డ్రగ్స్ కు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే ఆఫ్రికన్లు, నైజిరియన్లు పట్టుబడటం గమనార్హం.
బర్త్ డే పేరుతో మద్యం పార్టీ..
రంగారెడ్డి జిల్లా బాకారం ఫామ్‌హౌజ్‌లో ఆఫ్రికన్ దేశస్తుల బర్త్‌డే పేరుతో నిర్వహించిన పార్టీ కలకలం రేపింది. విదేశీయులంతా మద్యం మత్తులో ఎంజాయ్ చేస్తుండగా స్థానికుల సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ దాడుల్లో భారీగా విదేశీ మద్యం పట్టుబడింది. పోలీసుల అనుమతి లేకుండా మద్యం పార్టీ చేసుకోవడంతో మద్యం బాటిళ్లన్నీ స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో వారంతా ఆఫ్రికన్లు కావడంతో వీరిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పార్టీలో పాల్గొన్న 51 మంది ఆఫ్రికన్ దేశస్తుల్లో.. 11 మంది వీసా గడువు ముగిసినా ఇండియాలోనే కొనసాగుతున్నట్లు బయటపడటం గమనార్హం. అంతేకాక బర్త్ డే పార్టీలో పలువురు గంజాయి తీసుకున్నట్లు తేలింది. దానితో పాటు వారందరికీ డ్రగ్స్ టెస్టులు కూడా నిర్వహించారు. వారిలో కొంతమందికి పాజిటివ్ వచ్చినట్లు తేలడంతో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి వీసాలు కూడా పరిశీలించి కొంతమందికి నోటీసులు ఇచ్చారు.
హుక్కా గ్యాంగ్ అరెస్ట్...
మరోవైపు ఓ ఫామ్ హౌస్ లో హుక్కా తాగుతున్న ఏడుగురిని శంషాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. శంషాబాద్ మండల పరిధిలోని గండిగూడలోని ఒక ఫామ్ హౌజ్‌లో అసాంఘిక కార్యకలపాలు జరుగుతున్నాయని సమాచారం అందింది. దీంతో ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఫామ్ హౌస్ పై దాడి చేశారు... గురువారం అర్ధరాత్రి సమయంలో శంషాబాద్ రూరల్ పోలీసులకు కొందరు గండిగూడ గ్రామంలోని ఎం ఆర్ జీ ఫామ్ హౌస్ లో హుక్కా తాగుతున్నారని సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ నగరానికి చెందిన ఏడుగురు యువకులు ఎలాంటి అనుమతి లేకుండా పార్టీ చేసుకుంటున్నట్లు గుర్తించారు. ఫామ్ హౌస్ లో పరిశీలించిన పోలీసులు హుక్కా తాగడానికి ఉపయోగించే పరికరాలను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకోవడంతోపాటు, స్కూటీ, 5 మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : దేశానికి స్వాతంత్రం వచ్చినా..హైదరాబాద్ మాత్రం చీకట్లోనే...ఎందుకో తెలుసా?