Crime: మరో దారుణం.. పార్టీకి పిలిచి 24 ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్

ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ 24 ఏళ్ల యువతిని పార్టీకి పిలిచి నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ చేయడం కలకలం రేపింది. సివిల్‌ లైన్స్‌ ప్రాంతంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ అఘాయిత్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

New Update
Woman Gang Raped After Drink In Delhi

Woman Gang Raped After Drink In Delhi

ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ 24 ఏళ్ల యువతిని పార్టీకి పిలిచి నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ చేయడం కలకలం రేపింది. సివిల్‌ లైన్స్‌ ప్రాంతంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ అఘాయిత్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాజాగా బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమేదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. గురగ్రామ్‌లోని ఓ కంపెనీలో పనిచేస్తున్న యువతి(24)కి ఆదివారం ఫోన్‌ కాల్ వచ్చింది. ఆమె స్నేహితుడు.. తనను సివిల్‌ లైన్స్‌లోని తమ ఇంట్లో జరుగుతున్న పార్టీకి పిలిచాడు. ఆమె అక్కడికి వెళ్లింది. 

Also Read: ఢిల్లీలో కుప్పకూలిన చారిత్రక కట్టడం.. స్పాట్లో 9 మంది

అయితే ఈ పార్టీలో ఆమె స్నేహితుడు, మరో తెలిసిన వ్యక్తి.. ఇద్దరు యువకులు ఉన్నారు. వీళ్లందరూ కలిసి రాత్రి చాలాసేపు మద్యం తాగారు. ఆ యువతికి ఇచ్చిన డ్రింక్‌లో వాళ్లు ఏదో కలిపారు. ఆ తర్వాత ఆమె స్పృహ కోల్పోయింది. ఈ క్రమంలోనే ఆ నలుగురు నిందితులు కలిసి ఆమెను బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్లారు. అక్కడే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు వాళ్లు తనని కొట్టారని, ఈ అఘాయిత్యానికి సంబంధించి వీడియో కూడా తీశారని వాపోయింది. ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో ఈ వీడియో అప్‌లోడ్ చేస్తామంటూ బెదిరించారని తెలిపింది.   

ఈ ఘటన తర్వాత తనను ఇంటి బయట వదిలివెళ్లిపోయారని.. అనంతరం తాను పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పినట్లు పేర్కొంది. ఆ యువతికి వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు ఆమె తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని.. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వాళ్లని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని పేర్కొన్నారు. 

Also Read: మరికాసేపట్లో ట్రంప్-పుతిన్ భేటీ.. భారత్‌కు షాక్‌ ఇవ్వనున్నారా ?

ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రేప్

మరోవైపు ఇటీవలే ఢిల్లీలో 32 ఏళ్ల మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డారు. ముండ్కా పోలీస్‌ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. బాధిత మహిళ తన భర్త, పిల్లలతో కలిసి బెంగళూరులో ఉంటోంది. అయితే భర్త వేధింపులు తాళలేక ఆమె ఇంట్లో నుంచి పారిపోయి ఢిల్లీకి చేరుకుంది. రైలులో ప్రయాణిస్తున్నట్లు ఆ నిందితుడు ఈమెకు పరిచయం అయ్యాడు. ఢిల్లీలో ఇల్లు, ఉద్యోగం ఇప్పిస్తానని ఆమెను నమ్మించాడు. 

Also Read: బెంగళూరులో ఘోర అగ్ని ప్రమాదం.. సిలిండర్ పేలి స్పాట్‌లోనే 10 మందికి..

ఆ తర్వాత ఆ మహిళకు ఓ అద్దె ఇంటిని కూడా చూశాడు. ఆదివారం రాత్రి తన గదికి వచ్చాడు. బలవంతంగా ఆమెపై అత్యాచారం చేశాడు. అతను వెళ్లాక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి ఆచూకి కోసం గాలిస్తున్నారు. ఈ మధ్యకాలంలో మహిళలపై అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది . 

Also Read: ఫాస్ట్‌ట్యాగ్‌ యాన్యువల్‌ పాస్‌లు వచ్చేశాయి.. ఒక్కసారి చెల్లిస్తే ఏడాదంతా తిరగొచ్చు

Advertisment
తాజా కథనాలు