/rtv/media/media_files/2025/08/03/delhi-2025-08-03-09-11-26.jpg)
Delhi
ప్రస్తుత కాలంలో ప్రియుడి మోజులో పడి భర్తలను చంపుతున్న భార్యలు ఎక్కువయ్యారు. అయితే ఇటీవల హర్యానాలోని సోనిపట్‌లో ఓ భార్య తన ప్రియుడితో కలిసి అతి కిరాతకంగా హత్య చేసింది. దీంతో పోలీసులు సోనియాను, ప్రియుడిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జూలై నెలలో ప్రీతమ్ అనే వ్యక్తి తన భార్య సోనియాను తీసుకెళ్లడానికి సోనిపట్‌లోని ఆమె సోదరి ఇంటికి వెళ్లాడు. అయితే వారి మధ్య గొడవ జరగడంతో ప్రీతమ్ వెళ్లిపోయాడు. అదే రోజు సోనియా తన భర్తను చంపమని కోరుతూ తన సోదరి బావ విజయ్‌కి రూ.50,000 ఇచ్చింది. తర్వాత ప్రీతమ్ తిరిగి వచ్చాడు. ఆ రోజు సోనియా ఇంట్లోనే ప్రీతమ్ నిద్రపోయాడు. ఆ సమయంలో తన ప్రియుడు రోహిత్‌తో కలిసి ప్రీతమ్‌ను దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత శవాన్ని అగ్వాన్‌పూర్ సమీపంలోని కాలువలో పడేశారు.
ఇది కూడా చూడండి: Crime: ఏడు నెలల గర్భంతో భార్య.. కత్తితో పొడిచి చంపిన భర్త
ఆ తర్వాత ప్రీతమ్ భార్య సోనియా తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే నిజంగానే ప్రీతమ్ కనిపించడం లేదని, ఇది మిస్సింగ్ కేసు అని భావించారు. ప్రీతమ్ మొబైల్, ఆర్థిక లావాదేవీలు అన్ని కూడా చెక్ చేశారు. అయితే ప్రీతమ్ ఉపయోగించిన ఫోన్ ముందు పనిచేయలేదు. ఆ తర్వాత సోనిపట్‌లో పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఆ ఫోన్ సోనిపట్‌లో ఉన్నవారు వాడుతుండటంతో దాని ఆధారంగా రోహిత్‌ను పట్టుకున్నారు. అయితే రోహిత్ ఫస్ట్ ఈ కేసును తప్పుదోవ పట్టించేలా మాట్లాడాడు. ఆ తర్వాత నేరం ఒప్పుకున్నాడు. సోనియా తాను ప్రేమలో ఉన్నాడని, అందుకే ప్రీతమ్‌ను చంపినట్లు గుర్తించారు. తన భర్తను చంపడానికి సోనియా విజయ్‌కి డబ్బులు ఇచ్చిందని కూడా రోహిత్ తెలిపాడు. దీని తర్వాత సోనియా తన భర్త మొబైల్‌ను రోహిత్‌కి ఇవ్వడంతో పాటు ప్రీతమ్ ఆటో రిక్షాను రూ.4.5 లక్షలకు అమ్మివేసి ఇచ్చిందని తెలిపారు.
#WATCH | Delhi | Crime Branch arrested Soniya, 34 years, resident of Alipur, Delhi, with her boyfriend Rohit, for conspiring to murder and dumping the body of her husband, Pritam Prakash, one year after the case was registered in PS Gannaur, Sonipat, Haryana.
— ANI (@ANI) August 2, 2025
(Source: Delhi… pic.twitter.com/IGpBRNJwq0
ఏడాది క్రితం కేసు
దాదాపు ఏడాది కిందట హర్యానా పోలీసులు అగ్వాన్‌పూర్ కాలువలో ఒక గుర్తు తెలియని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఆ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సోనియా తన 15 ఏళ్ల వయస్సులో ప్రీతమ్‌ను ప్రేమించి, వారి కుటుంబాలకు ఇష్టం లేకుండా వివాహం చేసుకుంది. వారికి 16 ఏళ్ల కొడుకుతో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రోహిత్ కూడా పెళ్లి చేసుకోగా సోనియాతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. నిందితుడు రోహిత్ మీద గతంలో కూడా హత్యా కేసులు ఉన్నాయి. మొత్తం నాలుగు క్రిమినల్ కేసులు అతనిపై ఉన్నాయని పోలీసులు తెలిపారు. అయితే ప్రస్తుతం విజయ్ పరారీలో ఉన్నాడు. ఇతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇది కూడా చూడండి: 'వారానికి 80 గంటలు పనిచేయాలి'.. మరో వ్యాపారవేత్త కీలక ప్రకటన
Latest crime news | latest-telugu-news | telugu-news | national news in Telugu | telugu crime news