Crime: ఏడు నెలల గర్భంతో భార్య.. కత్తితో పొడిచి చంపిన భర్త

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దారుణం జరిగింది. గర్భవతితో ఉన్న భార్యను భర్త కత్తితో పొడిచి హత్య చేయడం కలకలం రేపింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

New Update
Man Stabbed His Pregnant Wife To Death, Called Cops, And Waited

Man Stabbed His Pregnant Wife To Death, Called Cops, And Waited

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దారుణం జరిగింది. గర్భవతితో ఉన్న భార్యను భర్త కత్తితో పొడిచి హత్య చేయడం కలకలం రేపింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. రవిశంకర్, స్వప్న దంపతులకు ఈ ఏడాది జనవరిలో పెళ్లి జరిగింది. అతడు భార్య ఇప్పుడు ఏడు నెలల గర్భవతిగా ఉంది. గత కొంతకాలంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గొడవల వల్ల ఐదు నెలలుగా స్వప్న.. అమ్హెరా ప్రాంతంలో తన సోదరి ఇంట్లో ఉంటోంది. 

అయితే శనివారం ఉదయం రవిశంకర్‌ తన భార్య స్వప్న ఉంటున్న చోటుకి వెళ్లాడు. ఆమెతో మాట్లాడటానికి వచ్చానని తన సోదరి కుటుంబీకులకు చెప్పాడు. ఈ క్రమంలోనే మొదటి అంతస్తులో భార్యను తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను ఓ గదికి తీసుకెళ్లి  లోపల డోర్‌కు లాక్ చేశాడు. ఆ తర్వాత అతడి వెంట తెచ్చుకున్న కత్తితో స్వప్న గొంతు కోశాడు. అలాగే ఆమె శరీరంపై పలుచోట్ల కత్తితో క్రూరంగా పొడిచాడు. భార్య చనిపోయే వరకు కత్తిపోట్లు పొడుస్తూనే ఉన్నాయి. లోపల డోర్‌ లాక్ వేయడం వల్ల స్వప్న అరుపులు విన్నప్పటికీ కుటుంబ సభ్యులు ఆమెను రక్షించలేకపోయారు.   

Also Read : 310 ఏళ్లుగా అదే రుచి.. అదే నాణ్యత.... తిరుపతి లడ్డు మొదట ఎలా ఉండేదంటే..?

భార్యను హత్య చేసిన తర్వాత రవిశంకర్‌ పోలీసులకు ఫోన్ చేశాడు. తన భార్యను చంపేసినట్లు పేర్కొన్నాడు. హుటాహుటీనా పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.తలపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. స్వప్న మృతదేహం రక్తపు మడుగుల్లో ఉండటం చూసి అందరూ షాకైపోయారు. అక్కడున్న రవిశంకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని స్వప్న మృతదేహాన్ని పోస్ట్‌మార్టం చేసేందుకు ఆస్పత్రికి తీసుకెళ్లారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అన్ని కోణాల్లో దీనిపై విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

ఇదిలాఉండగా.. యూపీలో మరో దారుణం జరిగింది. ఓ భార్య.. భర్త బతికుండగానే పాతిపెట్టాలని ప్రయత్నించడం కలకలం రేపింది. ఇజ్జత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పిరిధిలో ఈ దారుణం జరిగింది.  డాక్టర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రాజీవ్ భార్య సాధన ఈ హత్యకు ప్లాన్ వేసింది. తన ఐదురుగు సోదరులతో కలిసి భర్తను హత్య చేసేందుకు కొందరు గూండాలను కూడా కిరాయి తీసుకుంది. ఇక జులై 21న రాత్రికి రాజీవ్‌పై 11 మంది వ్యక్తులు దాడి చేశారు. అతడి చేయి, కాళ్లు విరిచేశారు. ఆ తర్వాత సజీవంగా పూడ్చిపెట్టాలని ప్లాన్ వేశారు. ఇందుకోసం గంజ్‌ అనే ప్రాంతంలో ఓ అడవికి తీసుకెళ్లి అక్కడ పాతిపెట్టేందుకు గొయ్యి తవ్వారు. కానీ అక్కడికి ఓ వ్యక్తి రావడంతో నిందితులు భయపడి మృతదేహాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. 

ఆ వ్యక్తి రాజీవ్‌ను ఆస్పత్రికి తరలించాడు. దీంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతడికి ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. రాజీవ్ తండ్రి నేత్రమ్ ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తన కొడుకును చంపాలనుకున్న వాళ్లని కఠినంగా శిక్షించాలని రాజీవ్ తండ్రి కోరుతున్నాడు. 

Also Read: 'వారానికి 80 గంటలు పనిచేయాలి'.. మరో వ్యాపారవేత్త కీలక ప్రకటన

Advertisment
తాజా కథనాలు