/rtv/media/media_files/2025/09/28/delhi-baba-2025-09-28-07-47-56.jpg)
ఢిల్లీ వసంత్ కుంజ్ ప్రాంతంలో శ్రీ శారద ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్‌గా పనిచేసిన స్వామి చైతన్యానంద సరస్వతి(Chaitanyananda Saraswati) అలియాస్ స్వామి పార్థసారథిని ఆగ్రాలో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆశ్రమంలో పోస్ట్-గ్రాడ్యుయేషన్ డిప్లొమా కోర్సులు చదువుతున్న 17 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణల కేసులో ఇతను పరారీలో ఉన్నాడు.
Also Read : UNలో విదేశాంగ మంత్రి జైశంకర్ ఫైర్.. ‘కొన్ని దేశాల్లో వాటిని వ్యాక్టరీల్లా నడుపున్నారు’
Delhi Baba Arrested From Agra
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అమ్మాయిలకు స్కాలర్‌షిప్‌లతో కోర్సులు అందిస్తున్న ఈ సంస్థలో చదువుతున్న 32 మంది విద్యార్థినుల వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేశారు. వీరిలో 17 మంది, సంస్థ డైరెక్టర్ స్వామి చైతన్యానంద సరస్వతి తమతో అసభ్యంగా మాట్లాడటం, అశ్లీల సందేశాలు (వల్గర్ మెసేజ్‌లు) పంపడం, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదు చేశారు. అంతేకాక, మహిళా టీచర్లు, సిబ్బంది కూడా నిందితుడి మాట వినాలని తమపై ఒత్తిడి తెచ్చారని బాధితులు ఆరోపించారు.
దొంగ నంబర్ ప్లేట్ కారు:
వేధింపుల ఆరోపణలు రావడంతో నిందితుడు పరారయ్యాడు. పోలీసులు అతడి కోసం గాలిస్తుండగా, చివరిసారిగా ఆగ్రా సమీపంలో ఉన్నట్టు గుర్తించారు. నిందితుడిపై గతంలో 2009, 2016లలో కూడా ఇలాంటి లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల నుండి అతను తప్పించుకున్నట్టు తెలుస్తోంది. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆశ్రమంలోని బేస్‌మెంట్ నుండి స్వామి చైతన్యానంద ఉపయోగించిన వోల్వో కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ కారుకు నకిలీ దౌత్యపరమైన నంబర్ ప్లేట్ ఉన్నట్టు గుర్తించారు. ఈ విషయంపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రస్తుతం నిందితుడిని అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. నిందితుడి చర్యల కారణంగా శ్రీ శృంగేరీలోని దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠం ట్రస్ట్ బోర్డ్, అతన్ని డైరెక్టర్ పదవి నుండి తొలగించి, సంస్థతో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకున్నట్టు ప్రకటించింది.
Also Read : విజయ్ ర్యాలీ.. ఘటనపై స్పందించిన నేతలు