/rtv/media/media_files/2025/05/23/eSKv2lVPlfenfSeXeeqQ.jpg)
External minister Jai shankar says operation sindoor has not stopped
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్(s-jaishankar), పాకిస్థాన్(pakistan) పై నిప్పులు చెరిగారు. పేరు ప్రస్తావించకుండానే ఓ దేశం ఉగ్రవాద కేంద్రాలను ఫ్యాక్టరీల్లా నడుపుతోందని, ఇది ప్రపంచ శాంతికి అతిపెద్ద ముప్పు అని అన్నారు.
ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాద నిర్మూలనకు కృషి చేస్తుంటే, కొన్ని దేశాలు మాత్రం ఉగ్రవాదాన్ని విదేశాంగ విధానంగా మార్చుకున్నాయని జైశంకర్ ధ్వజమెత్తారు. ఉగ్రవాదంపై మనం కఠినంగా వ్యవహరించాలి. ఉగ్రవాదాన్ని సమర్థించే లేదా అండగా ఉండే దేశాలను పూర్తిగా ఏకాకిని చేయాలని ఆయన ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు.
Also Read : లైంగిక వేధింపుల కేసులో చైతన్యానంద సరస్వతి అరెస్ట్
S Jaishankar Shreds Pakistan At UN
#BREAKING: Major Embarrassment for Pakistan at @UN. Entire UN General Assembly gives massive round of applause when India’s External Affairs Minister calls Pakistan a global epicentre of terrorism. Calls Pahalgam terror attack Cross Border Barbarism. Jaishankar not naming… pic.twitter.com/cnKa0LuaSA
— Aditya Raj Kaul (@AdityaRajKaul) September 27, 2025
Also Read : తొక్కిసలాటకు అసలు కారణం ఇదే.. షాకింగ్ నిజాలు చెప్పిన డీజీపీ!
జైశంకర్ మాట్లాడుతూ, ఉగ్రవాదం కేవలం ఓ ప్రాంతానికి సంబంధించిన సమస్య కాదని, ప్రపంచవ్యాప్తంగా శాంతి, భద్రతలకు ఇది సవాలు విసురుతోందని పేర్కొన్నారు. "ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలు, తమ ఉగ్రవాద కేంద్రాలను భారీ స్థాయిలో, వ్యవస్థీకృతంగా నడుపుతున్నాయి. ఈ కేంద్రాలు కేవలం శిబిరాలు మాత్రమే కాదు, అవి నిజంగా ఒక ఓ ఉగ్రవాద పరిశ్రమలా పనిచేస్తున్నాయి" అని ఘాటుగా విమర్శించారు. ఈ ఉగ్రవాద ఫ్యాక్టరీలు అంతర్జాతీయ సమాజానికి తక్షణ ముప్పుగా ఉన్నాయని హెచ్చరించారు.
ఈ సందర్భంగా, ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలు తేవాల్సిన ఆవశ్యకతను కూడా జైశంకర్ ప్రస్తావించారు. ప్రస్తుత ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవాలంటే, ఐరాస మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం భద్రతా మండలి విస్తరణ తప్పనిసరని భారత్ వాదనను ఆయన పునరుద్ఘాటించారు. మొత్తం మీద, జైశంకర్ ప్రసంగం ప్రపంచ వేదికపై ఉగ్రవాదం పట్ల భారత్ యొక్క కఠిన వైఖరిని, సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాలపై ఉన్న ఆగ్రహాన్ని మరోసారి చాటి చెప్పింది.