Vijay Road Show: విజయ్ ర్యాలీ..ఘటనపై స్పందించిన నేతలు

నటుడు , టీవీకే అధినేత విజయ్ రోడ్ షోలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఇందులో మృతుల సంఖ్య పెరుగుతోంది.  మరోవైపు ఈ ఘటనపై ప్రధాని మోదీతో సహా తమిళనాడు సీఎం స్టాలిన్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తదితరులు స్పందించారు. 

New Update
pm modi, vijay

తమిళనాడులోని కరూర్ లో సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన రోడ్ షోలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో  ఇప్పటి వరకు 31 మంది చనిపోయారు.  ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన వారిలో మహిళలతో పాటు చిన్నారులు ఉన్నారని చెబుతున్నారు.  విజయ్ సభకు ఊహించిన దని కంటే ఎక్కువ మంది రావడం వల్లనే ఈ తొక్కిసలాట జరిగిందని అధికారులు చెబుతున్నారు.  పదివేల మంది పట్టే చోట లక్ష మంది జనం వచ్చారని...దీని కారణంగానే తొక్కిసలాట జరిగిందని తెలుస్తోంది.  అయితే  పరిస్థితి గమనించిన విజయ్ ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి వారికి నీళ్ల బాటిళ్లను అందించారు. చాలా మంది స్పృహ తప్పి పడిపోయారు.  భారీ సమూహంలో అంబులెన్సులు అక్కడకు చేరుకోవడం ఇబ్బందిగా మారడంతో మృతుల సంఖ్య పెరిగింది. మరణించిన వారిలో పార్టీ కార్యకర్తలతోపాటూ ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారు. 

ఈ సంఘటనపై ప్రధాని మోదీతో పాటూ తమిళనాడు సీఎం స్టాలిన్, ఆంధ్ర డిప్యూటీ సీఎం  పవన్ కల్యాణ్ ఇతర నేతలు స్పందించారు. ప్రధాని మోదీ ఋ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందని అన్నారు. బాదిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధితులు మనో ధైర్యం కోల్పోకూడదని...గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మోదీ కోరుకున్నారు. 

స్టాలిన్ స్పందన...

దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరూర్ నుంచి వస్తున్న సమాచారం ఆందోళన కలిగిస్తోంది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు అన్ని రకాల సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. దాంతో పాటూ రోడ్ షో జరిగిన చోట సాధారణ పరిస్థితులు తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు చెప్పారు.  పౌరులు కూడా వైద్యులు, పోలీలసులకు సహకరించాలని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. 

పవన్ విచారకరం...

కరూర్ లో జరిగిన సంఘటన విచారకరమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. మృతుల్లో చిన్నారులు ఉండటం ఆవేదన కలిగించిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్న పవన్.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు తెలిపారు. 

Advertisment
తాజా కథనాలు