Supreme Court: చెట్టు నరికితే లక్ష ఫైన్.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు
యూపీలో ఓ వ్యక్తి రాత్రికి రాత్రే 454 చెట్లను నరికి వేయగా సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నరికిన ఒక్కో చెట్టుకు రూ.లక్ష ఫైన్‌తో పాటు మళ్లీ 454 మొక్కలు నాటాలని స్పష్టం చేసింది. అనుమతి లేకుండా చెట్లు నరికితే కఠిన చర్యలు తప్పవని తెలిపింది.