/rtv/media/media_files/2025/08/27/crime-news-2025-08-27-19-43-47.jpg)
Couple Poisons 4-Month-Old Son, Then Dies By Suicide Over Rising Debt
ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో దారుణం జరిగింది. అప్పుల బాధ తట్టుకోలేక ఓ కుటంబం బలవర్మణానికి పాల్పడింది. దంపతులు ముందుగా తమ నాలుగేళ్ల కొడుకుకి విషమిచ్చి చంపి ఆ తర్వాత వాళ్లిద్దరూ సూసైడ్ చేసుకున్నారు. ఇది గమనించిన స్థానికులు ఒక్కసారిగా షాకైపోయారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడ దొరికిన సూసైట్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. షాజహాన్‌పూర్‌లో సచిన్ గ్రోవర్ (30) అనే వ్యక్తి చేనేత వ్యాపారం చేస్తున్నాడు. అతని భార్య శివాని (28). వీళ్లకు నాలుగు నెలల కొడుకు ఫతేహ్ సంతానం.
Also Read: వీడు పోలీసు కాదు..రాక్షసుడు..వరకట్నం కోసం భార్యకు నిప్పంటించిన పోలీస్
ఇంటి సెకండ్ ఫ్లోర్‌లో ఈ కుటుంబం ఉంటోంది. అయితే బుధవారం ఉదయం నుంచి ఇంట్లో ఎవరూ బయటకు రాలేదు. పొరుగువారికి అనుమానం వచ్చింది. కిటికీల నుంచి చూస్తే లోపల గదుల్లో దంపతులు ఉరికి వేలాడుతున్నారు. ఇది చూసి షాకైన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటీనా ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. వాళ్ల నాలుగేళ్ల కుమారుడు మంచంపై అపస్మారక స్థితిలో పడిపోయాడు. భార్యభర్తల మృతదేహాలు వేరు వేరు గదుల్లో ఉరికి వేలాడుతూ కనిపించాయి.
Also Read: చెల్లి ప్రియాంకను ఎక్కించుకుని రాహుల్‌గాంధీ బైక్ రైడింగ్..VIDEO
అక్కడే సూసైట్ నోట్ కూడా దొరికింది. అందులో తమకున్న అప్పులు తీర్చేందుకు కారు, ఇల్లు అమ్మేయాలని సచిన్ కోరారు. '' నా ఫ్యామిలీపై ఎలాంటి ఫిర్యాదులు లేవు. పూర్తిగా నన్ను సపోర్ట్ చేశారు. మా కారు, ఇల్లు అమ్మేసి అప్పులు తీర్చండి. దీనివల్ల ఎవరూ మా అప్పులు చెల్లించలేదని చెప్పకుండా ఉండాలని'' సచిన్ తమ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.
అయితే సచిన్ మంగళవారం సాయంత్రం తన తల్లితో కూడా మాట్లాడినట్లు విచారణలో తేలింది. ఆ సమయంలో రూ.5 లక్షల బ్యాంకు లోన్ కట్టాల్సి ఉందని.. కానీ ఇప్పటిదాకా రూ.3 లక్షలే సమకూర్చినట్లు చెప్పాడని అతడి తల్లి చెప్పింది. ఆర్థిక ఇబ్బందులు, ఒత్తిడి కారణం వల్లే వాళ్లు తీవ్ర ఆవేదనకు గురై వాళ్లు సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి ఆ దంపతులు ముందుగా కుమారుడికి విషమిచ్చి చంపారని.. ఆ తర్వాత వాళ్లిద్దరూ ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయినట్లు పేర్కొన్నారు.
Also Read: పైసలకు కక్కుర్తి పడి కత్తులకు పని.. సిజేరియన్‌లో పుట్టిన పిల్లలకు భయంకరమైన వ్యాధులు!