/rtv/media/media_files/2025/08/27/dowry-harassment-case-2025-08-27-18-19-33.jpg)
Dowry Harassment case
Crime News: ఆధునిక సమాజంలోనూ వరకట్న వేధింపులు తప్పటం లేదు. వరకట్నం కోసం భార్యలకు నిప్పు పెడుతున్న మగవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇటీవల నోయిడాలో వరకట్నం కోసం భార్యకు నిప్పంటించిన ఘటన మరువక ముందే వరకట్న వివాదం తో మరో భర్త తన భార్యకు నిప్పంటించి సజీవ దహనానికి ప్రయత్నించాడు. నిప్పంటించిన వ్యక్తి పోలీసు కావడం గమానార్హం. కాగా, తీవ్రంగా కాలిన గాయాలైన ఆ మహిళను ఢిల్లీలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమ్రోహా జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. కాగా నిందితుడు పోలీస్ శాఖలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న దేవేంద్రగా తెలుస్తుంది. దేవేంద్ర ఇటీవల బరేలీకి బదిలీ అయ్యాడు. బదిలీ నేపథ్యంలో వారం రోజులు సెలవులో ఉన్న అతడు తన బంధువులతో కలిసి నర్సుగా పని చేస్తున్న భార్య పారుల్ ఇంటికి వచ్చాడు.
ఇది కూడా చదవండి:నర్సాపూర్ ట్రైన్‌లో భారీ దొంగతనం.. 68 గ్రాముల బంగారం చోరీ చేసిన దుండగులు!
ఈ సందర్భంగా తనకు ఇవ్వాల్సిన వరకట్న డబ్బుల విషయమై వారిద్దరి మధ్య వివాదం జరిగినట్లు తెలుస్తోంది. కోపంతో ఆమెకు నిప్పంటించి సజీవ దహనానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. కాగా, తీవ్రంగా గాయపడిన పారుల్‌ను బంధువులు తొలుత స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఢిల్లీలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పారుల్ సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ దేవేంద్ర, అతడి తల్లి, సోదరుడు సహా ఆరుగురిపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. దేవేంద్ర, పారుల్‌కు 13 ఏళ్ల కిందట వివాహమైందని, వారికి ఇద్దరు కవల పిల్లలున్నట్లు తెలుస్తోంది. అయితే వరకట్నం విషయంలో తరుచుగా గొడవలు అవుతున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి:AP Mega DSC 2025: ఏపీ మెగా డీఎస్సీలో ఘరానా మోసం .. ఫేక్ సర్టిఫికెట్లతో దొరికిపోయారు!