/rtv/media/media_files/2025/08/27/cesarean-deliveries-in-india-2025-08-27-12-42-27.jpg)
Cesarean Deliveries
Cesarean Deliveries: దేశంలో సిజేరియన్ల సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరగడమే తప్ప తగ్గడం లేదు. కొన్ని ప్రవైట్ హాస్పిటల్స్(Private Hospitals)లో డబ్బులకు ఆశపడి నార్మల్ డెలివరీ(Normal Delivery) అయ్యే అవకాశం ఉన్నా.. సీ సెక్షన్(C Section) (సిజేరియన్) ఆపరేషన్లు చేస్తున్నారు. ప్రసవానికి వెళ్లిన మహళల కడుపుకి కోత పెడుతున్నారు. ఇండియాలో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే డేటా ప్రకారం 2005లో సిజేరియన్ ఆపరేషన్లు 8.5 శాతం ఉండగా, 2021 నాటికి 21.5 శాతానికి చేరింది. డబ్బు కోసమే ప్రైవేట్ దవాఖానలు విచ్చలవిడిగా వీటిని చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ది లాన్సెట్ రీజినల్ హెల్త్ సౌత్ ఈస్ట్ ఆసియా జర్నల్‌లో పెరుగుతున్న సిజేరియన్లు గురించి పేర్కొన్నారు.
Alarming Increase in C-Section Deliveries in India
— Anup Soans (@anupsoans) August 27, 2025
Urgent Call for Private Healthcare Regulationhttps://t.co/Rm5yX9ivF5pic.twitter.com/qH4JxJQwG5
అలా పుట్టిన పిల్లలకు దీర్ఘకాళిక వ్యాధులు
ప్రసవ నొప్పులు భరించ లేకో, మరో ఇతర కారణాతోనూ వీటికే గర్భిణీలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో సిజేరియన్ డెలివరీల సంఖ్య కూడా బాగా పెరుగుతున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సిఫార్సు చేసిన స్థాయి కన్నా ప్రస్తుతం సిజేరియన్ల సంఖ్య ఎక్కువగా ఉంది. వీటి నివారణకు ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టాలని, విధాన నిర్ణయాలు తీసుకోవాలని, ప్రైవేట్ ఆరోగ్య రంగంపై ఆంక్షలు విధించాలని నిపుణులు సూచిస్తున్నారు. జనాభాలో 10 శాతం కంటే ఎక్కువ సిజేరియన్ డెలివరీల రేటు తగ్గిన మరణాలతో సంబంధం కలిగి లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. సి సెక్షన్ ఆపరేషన్ చేయించుకుంటే ఎక్కువ టైం హాస్పిటల్‌లో ఉండాలి. మెడిసిన్ కూడా అధికంగా వాడాలి. దీంతో ఖర్చులు బాగా పెరిగిపోతాయి. అంతేకాదు సిజేరియన్ డెలివరీలో జన్మించిన శిశువులకు ఉబ్బసం, ఊబకాయం, టైప్ 1 డయాబెటిస్, అలెర్జీలు వంటి ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.
రాష్ట్రాలవారీగా సి-సెక్షన్ రేటు
తెలంగాణ సి-సెక్షన్ ప్రసవాలలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. సిజేరియన్ ప్రసవాల రేటు 60.7% వరకు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా, ప్రైవేట్ ఆసుపత్రులలో అయితే ఈ రేటు 73% వరకు ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులలో 48%గా ఉంది. అంటే తెలంగాణలో ప్రసవిస్తున్న ప్రతి 100 మందిలో 60 మందికి పైగా సి-సెక్షన్‌లు అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా సి-సెక్షన్ రేటు చాలా ఎక్కువగానే ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులలో 41.40% కాగా, ప్రైవేట్ ఆసుపత్రులలో ఇది 67.71% వరకు ఉంది. తమిళనాడు (44.9%), కేరళ (38.9%) మరియు కర్ణాటక (31.5%) వంటి ఇతర దక్షిణ రాష్ట్రాలలో కూడా C-సెక్షన్ రేట్లు జాతీయ సగటు కంటే రెట్టింపు ఉన్నాయి.