Trump: గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు ట్రంప్‌ సీక్రెట్ ఆపరేషన్.. డెన్మార్క్‌ కీలక నిర్ణయం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటానని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ కీలక అప్‌డేట్‌ వచ్చింది. ట్రంప్‌తో సంబంధాలున్న ముగ్గురు వ్యక్తులు గ్రీన్‌లాండ్‌లో కోవర్డు ఆపరేషన్లు చేస్తున్నట్లు తెలిసింది.

New Update
Denmark summons US envoy after report of Americans carrying out influence operations in Greenland

Denmark summons US envoy after report of Americans carrying out influence operations in Greenland

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటానని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ అంశం తీవ్ర వివాదాస్పదమైంది. డెన్మార్క్‌ కూడా ఇప్పటికే ట్రంప్ వ్యాఖ్యలను ఖండించింది. అయితే తాజాగా ఓ కీలక అప్‌డేట్‌ వచ్చింది. ట్రంప్‌తో సంబంధాలున్న ముగ్గురు వ్యక్తులు గ్రీన్‌లాండ్‌లో కోవర్డు ఆపరేషన్లు చేస్తున్నట్లు తెలిసింది. ఆ దేశ అధికారిక మీడియాలో ఈ వార్తలు వచ్చాయి. దీనిపై డెన్మార్క్‌ విదేశాంగ మంత్రి లార్స్‌ లోకీ రాస్‌ముసెన్ తీవ్రంగా స్పందించారు. దీనిపై అమెరికా దౌత్యవేత్తకు సమన్లు జారీ చేశారు. '' 
ట్రంప్‌తో సంబంధాలున్న ముగ్గురు అమెరికన్లు గ్రీన్‌లాండ్‌లో ఉంటున్నారు.

Also Read: ఉద్యోగం కోసం ఇక అమెరికా పోలేరు.. భారతీయులకు ఊహించని షాక్ ఇచ్చిన ట్రంప్

వీళ్లు ఇక్కడ రహస్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.గ్రీన్‌లాండ్‌తో డెన్మార్క్‌కు ఉన్న సంబంధాలు బలహీనపర్చేందుకే పనిచేస్తున్నట్లు సమాచారం. వాళ్లు సొంతంగానే ఈ పని చేస్తున్నారా ? లేదా మిగతావారు ఎవరైనా వాళ్లకు ఆదేశాలు ఇస్తున్నారా ? అనేది స్పష్టంగా తెలియదని'' అధికారిక మీడియా డీఆర్‌ విశ్వనీయ వర్గాలను ఉటంకిస్తూ వెల్లడించింది. 

Also Read: హిందూమహాసముద్రంలో కూలిపోయిన స్పేస్ X రాకెట్.. ఇండియాకి ప్రమాదమా?

దీనిపై స్పందించిన రాస్‌ముసెన్ మాట్లాడుతూ '' కొన్ని విదేశీ శక్తులు గ్రీన్‌లాండ్‌పై ఆసక్తి కనబరుస్తాయని మాకు తెలుసు. స్థానిక వ్యవహారాలను ప్రభావితం చేయడం కోసం బయటి వ్యక్తులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు. కానీ మా అంతర్గత విషయాల్లో తలదూర్చడం కరెక్ట్ కాదని'' తేల్చిచెప్పారు.  గ్రీన్‌లాండ్, డెన్మార్క్‌ల మధ్య సహకారం ఎప్పటికీ సన్నిహితంగా అలాగే ఇరు ప్రాంతాల విశ్వాసంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. 

Also Read: భారత్ ఒక్కటే కాదు...అమెరికాకు మొత్తం 25 దేశాల పోస్టల్ సర్వీసులు బంద్..ఐరాస

ఇదిలాఉండగా గ్రీన్‌లాండ్‌ అనేది డెన్మార్‌లో ఉండే స్వయంప్రతిపత్తి కలిగిన దీవిగా ఉంది. దీన్ని తాము స్వాధీనం చేసుకుంటామని గతంలో ట్రంప్ చాలాసార్లు అన్నారు. 2016లో ఆయన మొదటిసారి అధ్యక్షుడు అయినప్పుడు కూడా ఈ ప్రతిపాదనను తీసుకొచ్చారు. వాస్తవానికి గ్రీన్‌లాండ్‌లో లిథియం, రాగి వంటి ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల్లో వీటిని ఎక్కువగా వాడుతుంటారు. ఈ క్రమంలోనే అమెరికా ఆ ప్రాంతంపై ఫోకస్ పెట్టింది. గ్రీన్‌లాండ్‌ను అమ్మడం అనేది కుదరదని.. భవిష్యత్తులో కూడా అలాంటి పని జరగదని ఇప్పటికే డెన్మార్క్‌ తేల్చిచెప్పింది. 

Also Read: సెల్ఫీ మరణాల్లో ఇండియానే టాప్‌.. రిపోర్టులో సంచలన నిజాలు

Advertisment
తాజా కథనాలు