Bengaluru: రోజుకు రూ.5000 ఇచ్చి పరుపెక్కు.. కాదని చెయ్ వేస్తే- భార్య వేధింపులతో పోలీస్ స్టేషన్‌కు భర్త!

నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి మాత్రమే ఒప్పుకున్నాను. పిల్లలను కనడానికి కాదంటూ ఓ భార్య తన భర్తను రెండేళ్లుగా వేధిస్తుంది. డైలీ రూ.5వేలు ఇస్తేనే కాపురం చేస్తాను, లేదంటే చనిపోతాను అనడంతో అతడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది.

author-image
By Seetha Ram
New Update
wife not

నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి మాత్రమే ఒప్పకున్నాను. పిల్లలను కనడానికి కాదు. పిల్లలు పుడితే నా అందం చెడిపోతుంది. అవసరమైతే పిల్లలను దత్తత తీసుకుందాం అంటూ ఓ భార్య తన భర్తను గత రెండేళ్లుగా వేధిస్తుంది. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. దీంతో విసుగు చెందిన అతను తన భార్యపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సాప్ట్‌వేర్ ఉద్యోగి శ్రీకాంత్, బిందుశ్రీ రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వారు తమ హనీమూన్ కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లారు. కాశ్మీర్ కు కూడా వెళ్ళిన ఆ జంటకు ఇంకా పిల్లలు పుట్టలేదు.

Also Read :   ఫిక్స్.. రేపే చాహల్తో విడాకులు.. ధనశ్రీకి రూ. 4.75 కోట్ల భరణం!

Also read  :  దేశంలో అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా బీజేపీ నేత.. ఆస్తులెంతంటే ?

బ్లాక్ మెయిల్ చేసి బెదిరింపులు 

భార్య బిందుశ్రీ తన భర్తను బలవంతంగా తాకితే చనిపోతానని డెత్ నోట్ రాసి మరి బ్లాక్ మెయిల్ చేసింది. భార్య  ప్రవర్తనతో విసిగిపోయి నరకం అనుభవించాడు శ్రీకాంత్.  భార్య మారుతుందని ఆశపడ్డాడు. కానీ ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు.  పెళ్లి చేసుకుని రెండు సంవత్సరాలు అయింది...  పిల్లలు ఎప్పుడని ఇంట్లో వాళ్లు, బంధువులు అడిగితే సమాధానం చెప్పడానికి శ్రీకాంత్ చాలా ఇబ్బంది పడేవాడు. బిందుశ్రీని పెళ్లి చేసుకోవడానికి  లక్షల రూపాయలు ఖర్చు కూడా చేసుకున్నాడు శ్రీకాంత్. తనను ముట్టుకుంటే చనిపోతానని..  మీకు అంతగా శృంగారం కావాలని అనిపిస్తే  వెళ్లి ఎవరితోనైనా పడుకోవచ్చు అంటూ తన భార్య చెబుతుందని శ్రీకాంత్ వాపోయాడు.  భార్యపై చాలా విసిగిపోయిన శ్రీకాంత్ శ్రీకాంత్ మల్లేశ్వరం సమీపంలోని వైలికావల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.  

Also Read :  'నా సూర్యుడివి నా చంద్రుడివి'.. నాన్న బర్త్ డే రోజు మనోజ్ ఎమోషనల్ ట్వీట్ !

Also Read :   సీఎం రేవంత్‌రెడ్డి, కేటీఆర్ లకు హైకోర్టులో భారీ ఊరట!

రోజుకు రూ.5వేలు ఇస్తేనే పని

ఆ ఫిర్యాదులో విస్తుపోయే విషయాలు చెప్పుకొచ్చాడు. రోజుకు రూ.5000 ఇస్తేనే కాపురం చేస్తానని, లేదంటే చనిపోతానని తన భార్య వేధిస్తుందని ఆ సాప్ట్‌వేర్ ఉద్యోగి శ్రీకాంత్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. 2022లో తనకు పెళ్లైందని.. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడంతో ఇంటి నుండే పని చేస్తున్నానన్నాడు. 
అయితే ఆ యువతి కాపురం చేయాలంటే తనకు రోజు రూ.5000 ఇవ్వాలని, లేదంటే రూ.45 లక్షలు ఇచ్చి విడాకులు తీసుకోవాలని నిత్యం వేధిస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. జూమ్ ద్వారా డ్యూటీకి హాజరయ్యే సమయంలో మధ్యలో వచ్చి డ్యాన్స్‌లు చేస్తుందని.. ఏ కారణం లేకుండానే తిడుతుందని.. ఏమైనా అంటే చనిపోతానని బెదిరిస్తుందని శ్రీకాంత్ పోలీసుల ముందు వాపోయాడు. ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు