దేశంలో అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా బీజేపీ నేత.. ఆస్తులెంతంటే ?

దేశంలో అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత పరాగ్‌ షా అని ఓ సర్వేలో తేలింది. ఈయన ఆస్తి రూ.3400 కోట్లుగా ఉంది. ఇక రెండో స్థానంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ నిలిచారు. ఈయన ఆస్తుల విలువ రూ.1413 కోట్లు.

New Update
BJP MLA Parag Shah

BJP MLA Parag Shah

దేశంలో అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత పరాగ్‌ షా అని తేలింది. ప్రస్తుతం ఆయన ముంబయిలోని ఘాట్కోపర్‌ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎమ్మెల్యేల ఆర్థిక, నేర, రాజకీయ నేపథ్యానికి సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్‌ (ADR) నిర్వహించింది. ఈ క్రమంలోనే దేశంలో అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా పరాగ్ షా నిలిచారు. ఈయన ఆస్తి రూ.3400 కోట్లుగా ఉంది. 

Also Read: భారత్‌కు రానున్న సునీతా విలియమ్స్‌.. గ్రామంలో సంబురాలు

ఇక రెండో స్థానంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ నిలిచారు. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ రూ.1413 కోట్లుగా ఉన్నట్లు ఏడీఆర్‌ పేర్కొంది. అత్యంత పేద ఎమ్మెల్యేగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే నిర్మల్ కుమార్‌ ధారా నిలిచారు. ఈయన ఆస్తులు కేవలం రూ.1700 మాత్రమే కావడం గమనార్హం. 

Also Read: పక్కా రాష్ట్రాలకు మూటలు మోస్తేనే ప్రజలు వాతలు పెట్టారు.. కేటీఆర్‌కు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!

ఎమ్మెల్యేగా పోటీ చేసే సమయంలో అభ్యర్థులు ఆస్తుల వివరాలకు సంబంధించి అఫిడవిట్లు దాఖలు చేస్తారన్న సంగతి తెలిసిందే. వీటినే ఏడీఆర్‌ పరిశీలించింది. ఈ క్రమంలోనే 28 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 4092 ఎమ్మెల్యేల ఆర్థిక పరిస్థితి, అలాగే వాళ్లపై ఉన్న కేసులు విశ్లేషించింది. అయితే దస్త్రాలు సరిగ్గా స్కాన్ చేయకపోవడంతో 24 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లను పరిశీలంచలేకపోయినట్లు ఏడీఆర్‌ పేర్కొంది.   

Also Read: తెలంగాణలో సుప్రీం కోర్టు తీర్పును అమలు చేశాం: సీఎం రేవంత్ రెడ్డి

Also Read: ఈసీ ప్రతిపాదనతో మా వాదనకు మద్దతు..రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు