ఫిక్స్.. రేపే చాహల్తో విడాకులు.. ధనశ్రీకి రూ. 4.75 కోట్ల భరణం!

భారత జట్టు స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ విడాకులపై బిగ్ అప్ డేట్ వచ్చింది.  వీరి విడాకులపై రేపు (మార్చి 20)  కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.  చాహల్, ధన శ్రీ విడాకుల కోసం బాంబే హైకోర్టులో ఫిబ్రవరి 5న పిటిషన్‌ దాఖలైంది.

New Update
yuzvendra chahal shares emotional post

yuzvendra chahal shares emotional post Photograph: (yuzvendra chahal shares emotional post)

భారత జట్టు స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ విడాకులకు సంబంధించి గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు కుప్పలుకుప్పలుగా వస్తున్నాయి. ఈ క్రమంలో వారి విడాకులపై బిగ్ అప్ డేట్ వచ్చింది.  వీరి విడాకులపై రేపు (మార్చి 20)  కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.  చాహల్, ధన శ్రీ విడాకుల కోసం బాంబే హైకోర్టులో ఫిబ్రవరి 5న పిటిషన్‌ దాఖలైంది. అయితే ఆరు నెలల కూలింగ్ పీరియడ్‌ను హైకోర్టు మినహాయించింది. వివాహ చట్టంలోని సెక్షన్ 13B ప్రకారం విడాకులు తీసుకోవడానికి 6 నెలల కూలింగ్ ఆఫ్ పీరియడ్ అవసరం. ఈ విడాకుల పిటిషన్‌పై 2025 మార్చి 20లోగా నిర్ణయం తీసుకోవాలంటూ ఫ్యామిలీ కోర్టును బాంబే హైకోర్టు ఆదేశించింది.  అయితే ధన శ్రీకి భరణం కింద రూ.4.75 కోట్లు ఇవ్వడానికి చాహల్ తెలుస్తోంది. ఇందులో ఇప్పటికే  చాహల్ రూ. 2.37 కోట్లు చెల్లించినట్లుగా సమాచారం.  

పంజాబ్ కింగ్స్ (PBKS) తరపున

34 ఏళ్ల యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆడటానికి సిద్ధమవుతున్నాడు. ఈసారి అతను పంజాబ్ కింగ్స్ (PBKS) తరపున ఆడనున్నాడు. ఈ టోర్నమెంట్ మార్చి 22న ప్రారంభమవుతుంది. పంజాబ్ జట్టు మార్చి 25న గుజరాత్ టైటాన్స్‌తో తన తొలి మ్యాచ్ ఆడనుంది. బాలీవుడ్ నటి ప్రీతి జింటా యాజమాన్యంలోని పంజాబ్ జట్టు, ఐపీఎల్ 2025 మెగా వేలంలో చాహల్‌ను కొనుగోలు చేసింది. చాహల్‌ను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీ రూ.18 కోట్ల భారీ బిడ్‌ను వేసింది. 

ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసుకోవడంతో

కాగా  ధనశ్రీ, యుజ్వేంద్ర ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో వీరి విడాకుల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 2020 డిసెంబర్ 22న వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. చాలా కాలంగా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. గత నెలలో చాహల్ న్యాయవాది నితిన్ కె గుప్తా మాట్లాడుతూ వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లుగా ధృవీకరించారు. 

Also read :  బాలీవుడ్ లో టాయిలెట్ వివాదం.. హీరో పై సీనియర్ నటుడి భార్య విమర్శలు!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు