/rtv/media/media_files/2025/03/19/56O2zFaUesK3q00B7I0f.jpg)
manoj birthday wishes to mohan babu
Manoj Manchu: మంచు ఫ్యామిలీ గత కొద్దిరోజులుగా వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మంచు మనోజ్, మోహన్ బాబు ఇద్దరూ ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకునే వరకు వెళ్లారు. అయితే ఓ వైపు తండ్రితో విభేదాలు ఉన్నప్పటికీ.. ఆయనపై తన ప్రేమను తెలియజేశారు మంచు మనోజ్.
తాజాగా మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా మనోజ్ ఎమోషనల్ ట్వీట్ షేర్ చేశారు.
Also Read: రామరాజ్యం ఆర్మీ పేరుతో అరాచకాలు.. వీరరాఘవరెడ్డి బాగోతం బయటపెట్టిన RTV!
Happy Birthday Nanna. We miss being next to you on this day of our celebration. Can’t wait to be around you nanna, love you with my everything. pic.twitter.com/n9P1yQYtHj
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 19, 2025
మంచు మనోజ్ ఎమోషనల్ ట్వీట్
మోహన్ బాబుతో కలిసి దిగిన ఫొటోలను, సినిమాల్లోని సన్నివేశాలను 'నా సూర్యుడివి నా చంద్రుడివి' పాటతో ఎడిట్ చేసి వీడియోను పంచుకున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా. బర్త్ డే రోజున మీ పక్కన లేనందున బాధగా ఉంది. నీ చుట్టూ ఉండటానికి ఇంక ఎక్కువ కాలం వేచి ఉండలేను నాన్న.. ఐ లవ్ యూ అంటూ తండ్రికి బర్త్ డే విషెష్ తెలియజేశారు మనోజ్.
Also Read: SSMB 29 Update: ‘SSMB 29’ నుంచి మహేశ్, ప్రియాంక కిర్రాక్ ఫొటోలు.. వాలీబాల్ ఆడుతున్న జక్కన్న!
ఇదిలా ఉంటే మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా 'కన్నప్ప'లో ఆయన నటించిన 'మహాదేవ శాస్త్రి' పాత్ర ఇంట్రో సాంగ్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మహాదేవ శాస్త్రి గర్జన ప్రతిధ్వనిస్తోంది.. మహాదేవ శాస్త్రి పరిచయ గీతంలో కోపం, విశ్వాసం ఏకమయ్యాయి. శైవ తుఫానుకు సిద్ధంగా ఉండండి! అంటూ మోహన్ బాబు పోస్టర్ రిలీజ్ చేశారు.
Also Read: Jaya Bachchan: బాలీవుడ్ లో టాయిలెట్ వివాదం.. హీరో పై సీనియర్ నటుడి భార్య విమర్శలు!