Prabhakar Crime: ప్రభాకర్ కేసులో భయంకర నిజాలు.. 100మంది అమ్మాయిలను అనుభవించి!

క్రిమినల్ బత్తుల ప్రభాకర్‌ కేసు విచారణలో భయంకర నిజాలు బయటకొస్తున్నాయి. ఛాతీపై 3, 100 నెంబర్ల టాటూ వెనక పెద్ద కథే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 3 అంటే రూ.3 కోట్లు కొట్టేయాలని, 100 మంది అమ్మాయిలను అనుభవించాలని అతడు స్కెచ్ వేసినట్లు వెల్లడించారు.

New Update
prabhakar

Criminal Battula Prabhakar

Prabhakar Crime: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్‌(Battula Prabhakar) కేసు విచారణలో భయంకర నిజాలు బయటకొస్తున్నాయి. ఛాతీపై 3, 100 నెంబర్లను టాటూ  వేసుకోగా దీని వెనక పెద్ద కథే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 3 అంటే రూ.3 కోట్లు కొట్టేయాలని, 100 మంది అమ్మాయిలను ట్రాప్‌చేసి అనుభవించాలని స్కెచ్ వేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే 100కు పైగా కేసులున్నట్లు గుర్తించిన పోలీసులు.. అతడికి గన్ ఎక్కడ నుంచి వచ్చింది? అనే మరికొన్ని అంశాలపై ఆరా తీస్తున్నారు.

కంగుతిన్న పోలీసులు..

ఈ మేరకు ప్రభాకర్ ను అదుపులోకి తీసుకుని టాటూల వెనుకున్న రహస్యాన్ని తెలుసుకున్న పోలీసులు కంగుతిన్నారు. అంతేకాదు హైదరాబాద్ శివారులో గన్‌ఫైరింగ్ ప్రాక్టీస్ చేసినట్లు ప్రభాకర్ అంగీకరించాడని చెప్పారు. ఇక ఇంజినీరింగ్ కాలేజీలే టార్గెట్‌గా నెలకో కాలేజీలో చోరీకి పాల్పడుతున్న ప్రభాకర్ లగ్జరీ కార్లు, విలాస జీవితం గడుపుతున్నట్లు తెలిపారు. ఇటీవల ఓ కాలేజీలో రూ.16 లక్షలు చోరీ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. 

Also Read:  Balakrishna: చక్రం తిప్పిన బాలయ్య.. హిందూపురం మున్సిపల్ పీఠంపై టీడీపీ.. అక్కడ కూడా!

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్..

ఇటీవల హైదరాబాద్‌‌ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్‌‌లో ప్రభాకర్ కాల్పులు జరపడం కలకలం రేగింది. తనను పట్టుకునేందుకు వచ్చిన పోలీసులపై ఈ దొంగ రెండు రౌండ్లు కాల్పులు జరపడంతో కానిస్టేబుల్‌, బౌన్సర్‌కు గాయాలయ్యాయి. అనంతరం ప్రభాకర్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా గుర్తించారు.  ఈ కాల్పుల్లో సైబరాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి తొడభాగంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అలాగే కానిస్టేబుల్‌తో పాటు పబ్‌లో ఉన్న ఒక బౌన్సర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు సాహసం చేసి ప్రభాకర్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గాయపడిన ఇద్దరినీ చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు.

Also Read: Viral Video: ఈ పెళ్లి కూతురు పాట వింటే పడి పడి నవ్వుతారు!.. వగలమారి వదిన.. దేవత లాంటి అత్తమ్మ అంటూ..!

Advertisment
తాజా కథనాలు