Home Guard Suicide: ఏపీలో దారుణం.. 6ఏళ్ల కొడుకుతో హోంగార్డు ఆత్మహత్య!

ఏపీలో దారుణం జరిగింది. అనకాపల్లి జిల్లా డీఎస్పీ కార్యాలయంలో హోంగార్డుగా పనిచేస్తున్న అట్టా ఝాన్సీ.. తన 6ఏళ్ల కొడుకుతో కలిసి ఏలేరు కాలువలో దూకడంతో ఇద్దరు చనిపోయారు. భర్త అచ్యుతరావు వేధింపులే కారణమని తేలడంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 

New Update
home guard

AP Anakapalli DSP Office Home Guard Jhansi Suicide

తెలుగు రాష్ట్రాల్లో పోలీసుల ఆత్మహత్యలు (Suicides) జనాలను కలవరపెడుతున్నాయి. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన వారే ప్రాణాలు తీసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కుటుంబ కలహాలతో కొందరు, అక్రమ సంబంధాలు, పై అధికారుల ఒత్తిడి తట్టుకోలేక మరికొందరు మరణిచడం సంచలనం రేపుతోంది. ఈ క్రమంలోనే ఏపీలో తాజాగా ఓ హోంగార్డు తన కొడుకుతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

Also Read :  చిలుకూరు ఆలయ అర్చకులు సీఎస్ రంగరాజన్ పై దాడి

భర్త టార్చర్ తట్టుకోలేక..

అనకాపల్లి జిల్లా (Anakapalle District) డీఎస్పీ కార్యాలయంలో హోంగార్డుగా పనిచేస్తున్న అట్టా ఝాన్సీ, అచ్యుతరావు అలియాస్‌ విజయ్‌ కి కొంతకాలం క్రితం వివాహమైంది. అయితే ఇటీవల వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతుండగా తీవ్ర మనస్తపం చెందుతుంది ఝాన్సీ. ఈ క్రమంలోనే భర్త టార్చర్ తట్టుకోలేక తన 6ఏళ్ల కొడుకు దినేశ్‌ కార్తీక్‌తో కలిసి ఝాన్సీ ఏలేరు కాలువలో దూకింది. శుక్రవారం కశింకోటలోని ఇంటి నుంచి కొడుకుని తీసుకుని బయటకు వచ్చిన ఆమె సూసైడ్ చేసుకోవడం స్థానికులను కలిచివేసింది. స్థానికుల సమాచారంతో ఏలేరు కాలువలో మృతదేహాలను స్వాధీనం చేసుకుని కుటుంబసభ్యులకు అప్పగించారు పోలీసులు. నిందితుడు అచ్యుతరావును అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు. 

Also Read :  సూర్యాస్తమయం తర్వాత మహిళలను అరెస్టు చేయొచ్చు.. హైకోర్టు సంచలన తీర్పు

బ్రిడ్జికి ఉరి వేసుకుని..

ఇదిలా ఉంటే.. తెలంగాణలోని జయశంకర్ జిల్లా ఏటూరునాగారంలో విషాదం చోటుచేసుకుంది. జీవితంపై విరక్తితో ఓ వ్యక్తి బ్రిడ్జికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మంగపేట మండలంలో ఆదివారం ఉదయం జరిగింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పద్మశాలి వాడకు చెందిన సురేష్.. ఏటూరునాగారం రామాలయం వీధికి చెందిన రేణుకను పెళ్లి చేసుకున్నాడు.  వారిద్దరూ మండల కేంద్రంలో ఉంటూ కొంత కాలంగా బేకరీలో పని చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే.. ఈ మధ్య మద్యానికి బానిసైన సురేష్ పనులకు వెల్లకుండా భార్యతో గొడవపడుతూ కాలం వెళ్లదీస్తున్నాడు.  

ఇది కూడా చదవండి: AP BJP: బీజేపీ విజయంపై పురంధేశ్వరి సంచలన కామెంట్స్.. విధ్వంసాలు, కక్షలతోనే అంటూ!

నెల రోజుల క్రితం మంగపేటలో ఉంటున్న తన అక్క నర్సమ్మ ఇంటికి వచ్చినట్లు తెలిపారు. ఈ క్రమంలో అనారోగ్యానికి గురైన సురేష్‌ను అక్క, ఆమె పిల్లలు ఏటూరునాగారంలోని సామాజిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడే వైద్యం చేయించి భార్యకు సమాచారం ఇచ్చారు. తరువాత ఆదివారం గౌరారం వాగు బ్రిడ్జికి సురేష్ (37) ఉరివేసుకుని మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read :  వాలెంటైన్స్ డే స్పెషల్.. ఓటీటీలో సినిమాల సందడే సందడి! లిస్ట్ ఇదే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు