/rtv/media/media_files/2025/02/09/BDdCrHkBWKKK3EPh0gRD.webp)
CS Rangarajan
Chilkur Balaji Temple : చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అడ్డొచ్చిన ఆయన కుమారుడిని గాయపరిచారు. దీనిపై చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవీ సౌందర్ రాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఇది కూడా చూడండి: Sankranthiki Vasthunam: వెంకీ మామ ఫ్యాన్స్ గెట్ రెడీ.. యూట్యూబ్ లో 'గోదారి గట్టు మీద' సాంగ్ ఫుల్ వీడియో
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని చిలుకూరు బాలజీ ఆలయం సమీపంలోని రంగరాజన్ నివాసానికి శుక్రవారం నాడు పలువురు వ్యక్తులు వచ్చారు. రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని కోరారు. అయితే, ఆ సమయంలో దురుసుగా వ్యవహరించారని.. వారి మాట కాదన్నందుకు రంగరాజన్ పైన దాడికి పాల్పడ్డారని లేఖ లో పేర్కొన్నారు. రామరాజ్యం పేరుతో వచ్చిన వ్యక్తుల మాట నిరాకరించినందుకు తమ కుమారుడిని తీవ్రంగా హింసించారని.. తనపైనా దాడి చేశారని ఆయన తెలిపారు. ఈ దాడికి పాల్పడిన వారితో పాటు పరోక్షంగా వారికి సహకరించిన వ్యక్తులను కూడా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవీ సౌందర్ రాజన్ ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చూడండి: Pakistan PM : పరువు తీయొద్దు .. భారత్ పై గెలవండి..కప్ తీసుకురండి : పాక్ ప్రధాని
చిలుకూరు ప్రధాన అర్చకులు రంగ రాజన్ ఇంటిపై వీర రాఘవ రెడ్డి తన అనుచరులు 20 మందితో కలిసి దాడికి పాల్పడ్డారని రంగరాజన్ కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు. తన అనుచరులతో కలిసి ఇంట్లోకి చొరబడి విచక్షణారహితంగా రంగరాజన్‌పై వీర రాఘవరెడ్డి అనుచరులు దాడి చేశారు. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అర్చకులు మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు వీర రాఘవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కాగా మూడ్రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
Also Read: సూర్యాస్తమయం తర్వాత మహిళలను అరెస్టు చేయొచ్చు.. హైకోర్టు సంచలన తీర్పు
చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్పై దాడి చేసిన వీర రాఘవరెడ్డిని మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రామరాజ్య స్థాపనకు మద్దతివ్వాలని, ఆలయ బాధ్యతలు అప్పగించాలని కోరారని.. దానికి నిరాకరించడంతో దాడికి పాల్పడ్డారని రంగరాజన్ పోలీసులకు ఫిర్యా దు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వీరరాఘవరెడ్డిని అరెస్టు చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Mastan sai: టాలీవుడ్ To పాలిటిక్స్ ఎవరిని వదలని మస్తాన్ సాయి: టోటల్ లిస్ట్ ఆడియో వైరల్!
సౌందర్ రాజన్ హిందూ ధార్మిక వ్యవహారాల పైన తరచూ స్పందిస్తూ ఉంటారు. తాజాగా ముత్యాలమ్మ ఆలయం ఘటన సమయంలోనూ సందర్శించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సనాతన హిందూ బోర్డు ఏర్పాటు డిమాండ్ కు మద్దతు ఇచ్చారు. వీసా బాలాజీ టెంపుల్ గా పేరున్న చిలకూరు ఆలయం ప్రధానార్చకుడి పైన దాడి జరగటంతో పోలీసులు నిందితులను పట్టుకునేందుకు విచారణ ప్రారంభించారు.
ఇది కూడా చూడండి: Fake Gold: షాపు ఓనర్కు మస్కా : నకిలీ బంగారం తాకట్టు పెట్టి.. అసలు బంగారంతో పరార్!