/rtv/media/media_files/2025/08/08/lover-2025-08-08-09-21-02.jpg)
గుజరాత్(Gujarat) లో దారుణం జరిగింది. ప్రేమించిందని 18ఏళ్ల కూతుర్ని చంపేశాడు ఓ తండ్రి. ప్రియుడు హరేష్ చౌదరి హెబియస్ కార్పస్ పిటిషన్‌తో ఈ నిజం బయటపడింది. బనస్కాంత జిల్లా దంతియా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వడ్గాండ గ్రామానికి చెందిన హరేష్ చౌదరితో చంద్రిక(18) ప్రేమాయణం నడుపుతుంది. ఈ విషయం చంద్రిక ఇంట్లో తెలిసింది. అయితే హరేష్‌కు అప్పటికే వివాహం జరగడం, ఓ కుమారుడు కూడా ఉండటవతో చంద్రిక పేరెంట్స్ అందుకు ఒప్పుకోలేదు.
దీంతో అహ్మదాబాద్ పారిపోయి హరేష్, చంద్రిక సహజీవనం(Relationship) చేస్తున్నారు. దీంతో జూన్ 12న రాజస్థాన్‌లో చంద్రికను పట్టుకొని బంధువులు ఇంటికి తీసుకెళ్లారు. పాత కేసులో జైలుకెళ్లిన హరేష్, జూన్ 21న విడుదలయ్యాడు. జూన్ 17న తన కుటుంబం తనను చంపేస్తారని హరేష్ కు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మెసేజ్ చేసింది చంద్రిక. అయితే జైలులో ఉన్నందున హరేష్ వాటిని చూడలేకపోయాడు. కూతురు చేసిన పనుల వలన తన పరువుపోయిందని భావించిన చంద్రిక తండ్రి సేందాభి పటేల్ ఆమెను చంపేయాలని నిర్ణయించాడు.
ఆమెకు పాలలో నిద్రమాత్రాలు కలిపి ఇచ్చారు. జూన్ 24 అర్థరాత్రి ఆమె స్పృహ కోల్పోగానే గొంతు కోసి చంపేశాడు. అనంతరం ఎవరికి తెలియకుండా ఆమె అంత్యక్రియలు కూడా నిర్వహించారు. అయితే తన ప్రేయసి కనిపించడం లేదని ప్రియుడు పరేష్ గత నెలలో హెబియస్ కార్పస్ పిటిషన్ గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే విచారణకు రెండు రోజుల ముందే ఆమెను చంపినట్లుగా యువతి తండ్రి నిజం ఒప్పుకున్నాడు. ఈ కేసులో చంద్రిక మేనమామ శివరాంభాయ్ పటేల్‌ను కూడా అరెస్టు చేశారు పోలీసులు. ఈ సంఘటన గుజరాత్ లో తీవ్ర సంచలనం సృష్టించింది.
Also Read : దెబ్బకు దెబ్బ..ప్రతీకార సుంకాల తర్వాత బోయింగ్ విమానాల ఒప్పందాన్ని నిలిపేసిన భారత్
హెబియస్ కార్పస్ అంటే ఏమిటి?
హెబియస్ కార్పస్(Habeas Corpus) అంటే, ఒక వ్యక్తి అక్రమంగా నిర్బంధంలో ఉంటే, ఆ వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచమని కోర్టు జారీ చేసే ఒక రిట్. ఈ రిట్ ద్వారా పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు తప్పనిసరిగా ఆ వ్యక్తిని వెతికి పట్టుకుని హాజరుపరచాల్సి ఉంటుంది. ఈ కేసులో ప్రియుడు దాఖలు చేసిన పిటిషన్ కారణంగానే ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
Also Read : పేలిన గ్యాస్ సిలిండర్.. ఐదుగురు మృతి