ఏపీలోని విశాఖపట్నంలో ఘోర ప్రమాదం జరిగింది. ఫిషింగ్ హర్బర్‌లోని గ్యాస్ సిలిండర్ పేలి అయిదుగురు మృతి చెందడం కలకలం రేపింది. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి స్థానికులు చెబుతున్నారు. నగరంలోని వన్‌టౌన్ పరిధిలో ఫిషింగ్ హర్బర్ సమీపంలోని హిమాలయ బార్ వద్ద వెల్డింగ్ స్క్రాప్ దుకాణంలో గురువారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పేలుడు తీవ్రతకు మృతదేహాలు చెల్లచెదురుగా పడిపోయాని.. గుర్తుపట్టలేని విధంగా మారాయని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
Also Read: తల్లి ఎఫైర్.. తట్టుకోలేక కొడుకు సూ**సైడ్.. ఆ గ్రామంలో హైటెన్షన్!
బ్రేకింగ్ న్యూస్
— Telugu Scribe (@TeluguScribe) August 7, 2025
విశాఖలో గ్యాస్ పేలుడు ఐదుగురి మృతి
విశాఖ వన్ టౌన్ పరిధిలోని ఫిషింగ్ హార్బర్ సమీపంలో హిమాలయ బార్ వద్ద వెల్డింగ్ స్క్రాప్ దుకాణంలో వెల్డింగ్ చేసే సమయంలో ప్రమాదం
పేలుడు తీవ్రతకు గుర్తు పట్టలేని విధంగా చెల్లాచెదురైన మృతదేహాలు pic.twitter.com/S29nJN4CAf
Also Read: ఓటర్ల జాబితాలో అక్రమాలు.. వివరాలు ఇవ్వాలని రాహుల్‌కు ఈసీ సవాల్
గురువారం సాయంత్రం ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలింది. సమాచారం మేరకు పోలీసులు హుటాహుటీనా ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తీసుకెళ్లారు. అయితే వెల్డింగ్ చేసే సిలిండర్ పేలినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని.. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Also Read: మావోయిస్టు అగ్రనేతకు నోటీసులు..ఇంటికి అంటించిన పోలీసులు
ఈ మధ్యకాలంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదాలు జరుగుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఇటీవల సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి రసాయన పరిశ్రమలో భారీ రియాక్టర్ పేలిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. అలాగే ఇటీవల అనకాపల్లి జిల్లాలో కూడా ఓ బాణసంచా కర్మాగారంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందడం కలకలం రేపింది.
Also Read: పులివెందులలో ఏం జరుగుతోందంటే?.. వై.ఎస్ సునీత సంచలన వ్యాఖ్యలు!