/rtv/media/media_files/2025/01/28/s1UuSuJHkj8pJZaFDAsZ.jpg)
Pm Narendra Modi, President Trump
అమెరికాతో అనేక రకాల వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది ఇండియా. ఇందులో బోయింగ్ జెట్ విమానాల అగ్రిమెంట్ ఒకటి. తాజాగా దీన్ని భారత్ నిలిపివేసినట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదనపు సుంకాల నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా నుంచి ఇండియా బోయింగ్ జెట్ విమానాల కొనుగోలు చేయడానికి 3.6 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని భారత్ చేసుకుంది. దాంతో పాటూ ఆరు అదనపు బోయింగ్ P-8I సముద్ర గస్తీ విమానాల కోసం అసలు ఒప్పందాన్ని 2021లో US స్టేట్ డిపార్ట్‌మెంట్ $2.42 బిలియన్లకు ఆమోదించింది.
అదనపు సుంకాల నిర్ణయం వల్లనే..
అయితే ఇప్పుడు ట్రంప్ అదనపు సుంకాలు విధించడంతో వీటి ధర పెరుగుతుంది. దాదాపు 50 శాతం ఎక్కువ అవుతోంది. దీనివల్ల విమానాల సేకరణకు సంబంధించిన విడిభాగాలు, భాగాలు ఖరీదైనవిగా మారతాయి. ఈ భారత్ అంతా భారత్ మీదనే పడనుంది. అందుకే ఈ బోయింగ్ జెట్ విమానాల ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసుకోవాలని భారత్ భావిస్తోంది. అయితే రక్షణ శాఖ దీన్ని వ్యూహాత్మకంగానే నిలిపేసిందని..అమెరికాతో వాణిజ్య చర్చల తర్వాత పునరుద్ధరించే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు భారత ప్రభుత్వం నుంచి దీనిపై ఎటువంటి ధృవీకరణ రాలేదు.
ఏంటీ బోయింగ్ ఒప్పందం..
ఎయిర్ ఇండియా 787-8 డ్రీమ్‌లైనర్‌లను అమెరికాలో రెట్రోఫిట్టింగ్ కోసం పంపడం ప్రారంభించిన తర్వాత రెండు దేశాల మధ్యనా బోయింగ్ జెట్ విమానాల ఒప్పదం జరిగింది. ఎయిర్ ఇండియా వద్ద మొత్తం 33 డ్రీమ్‌లైనర్లు ఉన్నాయి. వాటిలో 26 లెగసీ బోయింగ్ 787-8లు మరియు 7 బోయింగ్ 787-9లు ఉన్నాయి. ఎయిర్ ఇండియా మొదటి లెగసీ డ్రీమ్‌లైనర్‌ను అమెరికాలోని బోయింగ్ సౌకర్యంలో రెట్రోఫిట్ కోసం పంపించారు. ఇందులో వివిధ సర్టిఫికేషన్ ప్రక్రియలు ఉంటాయి. మిగిలిన వాటికి టెంప్లేట్‌గా ఉండే రెట్రోఫిట్ చేయబడిన విమానం ఈ సంవత్సరం చివరి నాటికి ఫ్లీట్‌లో చేరుతుందని భావిస్తున్నారు. అది పూర్తయిన తర్వాత, ప్రతి నెలా రెండు లెగసీ డ్రీమ్‌లైనర్‌లను రెట్రోఫిట్ చేయడానికి పంపాలని ఎయిర్‌లైన్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు వర్గాలు తెలిపాయి.
మరోవైపు అదనపు సుంకాల విషయంలో వివాదాలు సమసేంత వరకూ భారత్ తో ఎటువంటి వాణిజ్య చర్చలూ జరగవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటున్నారు. ఎలా అయినా భారత్ ను తమ కిందకు తీసుకురావాలని ఆయన భావిస్తున్నారు. అన్ని దేశాలు తన మాట వినాల్సిందే తప్ప తాను ఎవరికీ తలవంచనని సూచిస్తున్నారు. దీంతో రష్యా...ఉక్రయెన్ తో యుద్ధం మానేంత వరకు సుంకాల వివాదం సద్దుమణిగేలా కనిపించడం లేదు.
Also Read: USA: వాణిజ్య చర్చలకు ఒప్పుకోను...ట్రంప్ మొండి పట్టుదల