/rtv/media/media_files/2025/10/11/crime-2025-10-11-18-39-34.jpg)
A Man Strangles Mother, Hangs Her Body With Rope to Stage Suicide in Uttar Pradesh
ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh)లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి ఆస్తి కోసం ఏకంగా తన తల్లినే హత్య చేశాడు(son killed mother). ఆ తర్వాత ఆమె సూసైడ్ చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశాడు. చివరికి పోస్టుమార్టం రిపోర్టులో ఇది హత్యగా తేలడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఇంతకీ అసలే జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. కౌశింబి జిల్లాలో ఖేర్వా అనే గ్రామంలో షీలా దేవి(55) అనే తన బంధువుల ఇంట్లో ఉంటోంది. అక్టోబర్ 9న సాయంత్రం పూట ఆ ఇంట్లోనే అనుమానస్పదంగా మృతి చెందింది.
Also Read: మరో బాణాసంచా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మంటల్లో!
Son Killed Mother
ఆమె మృతదేహం సీలింగ్‌కు వేలాడుతూ కనిపించింది. ఇది చూసిన బంధువులు షాక్ అయిపోయారు. ఆత్మహత్య చేసుకుందేమోనని భావించారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. షీలా దేవి మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు. అయితే ఆ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఆమె గొంతు నొక్కి హత్య చేసినట్లు ఆ రిపోర్టులో తేలిసింది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు.
Also Read: ట్రంప్ మరో టారీఫ్ బాంబ్.. చైనా దిగుమతులపై 100% సుంకాలు
చివరికి షీలా దేవి కొడుకైన కిషన్ కిషోర్(30)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా అసలు విషయం బయటపడింది. తానే తల్లిని హత్య చేసినట్లు అంగీకరించాడు. తల్లి పేరు మీద ఉన్న భూమి, అలాగే తన బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.3 లక్షలు తన సోదరుడికి ఇస్తుందన్న భయంతోనే ఈ ఘటనకు పాల్పడ్డానని చెప్పాడు. హత్య తర్వాత మృతదేహాన్ని సీలింగ్‌కు వేలాడదీసి సూసైడ్ చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశానని తెలిపాడు. దీంతో పోలీసులు కిషోర్‌పై హత్య కేసు నమోదు చేశారు .
Also Read: అప్పుడు బ్రిటన్ ప్రధానిగా.. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఉద్యోగిగా రిషి సునాక్
Follow Us