Donald Trump : ట్రంప్ మరో టారీఫ్ బాంబ్..   చైనా దిగుమతులపై 100% సుంకాలు

ఆమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో టారీఫ్ బాంబ్ పేల్చారు.  చైనా దిగుమతులపై 100% సుంకాలు విధించారు. నవంబర్ 1 నుంచి పెంచిన టారీఫ్‌లు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే డ్రాగన్‌పై 30 % సుంకాలు విధించారు ట్రంప్.

New Update
trump

అమెరికా(america) అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) మరో టారీఫ్ బాంబ్ పేల్చారు.  చైనా దిగుమతులపై 100% సుంకాలు విధించారు. నవంబర్ 1 నుంచి పెంచిన టారీఫ్‌లు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే డ్రాగన్‌పై 30 % సుంకాలు విధించారు ట్రంప్.. ప్రస్తుతం చైనా ఉత్పత్తులపై ఉన్న సుంకాలకు ఇది అదనం కావడం గమనార్హం. అంటే, చైనా వస్తువులపై మొత్తం టారిఫ్ సుమారు 130 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.

చైనా ఇటీవల అరుదైన భూ మూలకాలఎగుమతులపై ఆంక్షలను కఠినతరం చేయడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ వ్యవస్థల్లో కీలకమైన ఈ ఖనిజాలపై చైనా ప్రపంచంలోనే ఆధిపత్యం చెలాయిస్తోంది. చైనా చర్యను ట్రంప్ తీవ్రంగా ఖండించారు.

Also Read :  అప్పుడు బ్రిటన్‌ ప్రధానిగా.. ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌ కంపెనీలో ఉద్యోగిగా రిషి సునాక్‌

కుప్పకూలిపోయిన స్టాక్ మార్కెట్లు

ట్రంప్‌ టారిఫ్స్‌(trump tariffs)తో అమెరికా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ఒక్కరోజే అమెరికా మార్కెట్లలో 1.5 ట్రిలియన్‌ డాలర్ల సంపద ఆవిరి అయిపోయింది. మార్కెట్లు ముగిసే సమయానికి నాస్‌డాక్‌కు 3.56 శాతం, డోజోన్స్‌కు 1.90శాతం, ఎస్‌అండ్‌పీకి 500 సూచీ 2.71శాతం నష్టాలు చవిచూశాయి.  దీంతో రెండు దేశాల మధ్య మళ్లీ వాణిజ్య యుద్ధం నడుస్తుందనే భయాలు  మొదలయ్యాయి. 

ఈ ప్రకటన ప్రపంచ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టించింది. ట్రేడ్ వార్ మళ్లీ మొదలవుతుందనే భయంతో అమెరికన్ స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోయాయి. ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందని, సప్లై చైన్ దెబ్బతింటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ట్రంప్ తరచుగా టారిఫ్‌లను ఒక బేరసారాల సాధనంగా ఉపయోగిస్తారనే విషయం తెలిసిందే. అయితే, చైనా ప్రతిగా ఆంక్షలు విధిస్తే ఈ వాణిజ్య వివాదం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.

Also Read :  నాటకీయ పరిణామం.. తిరిగి ప్రధానిగా లెకోర్నుకే పగ్గాలు?

Advertisment
తాజా కథనాలు