/rtv/media/media_files/2025/10/29/crime-2025-10-29-16-14-19.jpg)
14 year old girl raped in gujarat, Three Arrested
గుజరాత్(gujaratgujarat) లో దారుణం చోటుచేసుకుంది. 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం(gang-rape) జరిగింది. సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వాళ్లు తమ నేరాన్ని అంగీకరించారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. సబర్కాంతలోని గభోయ్ ప్రాంతంలో బాధితురాలు మార్కెట్‌కు ధాన్యం తీసుకెళ్తోంది. స్థానికంగా ఉంటున్న ఓ దుండగుడు ఆమెను బలవంతంగా సమీపంలో ఉన్న పొలానికి లాక్కెల్లాడు.
Also Read: బ్రేక్‌అప్ అయిన ఉద్యోగికి 12 రోజులు సెలవులు.. CEO ట్వీట్ వైరల్
14 Year Old Girl Raped In Gujarat
అక్కడే మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. నిందితుల్లో ఒకడు ఆమెను పట్టుకోగా.. మిగిలిన ఇద్దరు ఆమెపై అత్యాచారం చేశారు. ఈ ఘటన జరిగిన తర్వాత బాధితురాలు కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెప్పింది. దీంతో వాళ్లు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నిందితుల్లో ఇద్దరు తమ నేరాన్ని అంగీకరించగా మరొకరు వాళ్లకు సాయం చేసినట్లు చెప్పారు. చివరికి పోలీసులు వాళ్లపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
Also Read: ఈసారి రిపబ్లిక్ డే డబుల్ ధమాకా.. 2026 జనవరి 26కి ఇండియా చరిత్రలో ఫస్ట్ టైం!
ఇదిలాఉండగా ఇటీవల పశ్చిమ బెంగాల్‌లోని ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీకి చెందిన 23 ఏళ్ల వైద్య విద్యార్థిని కళాశాల సమీపంలో సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటనలో పోలీసులు అయిదుగురు నిందితులను అరెస్టు చేశారు. అలాగే కర్ణాటకలోని బెంగళూరు శివార్లలో ఓ 26 ఏళ్ల బ్యూటీషియన్‌పై అయిదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా వాళ్లు రికార్డు చేసినట్లు సమాచారం. చివరికి రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
Follow Us