Breakup Leave Mail: బ్రేక్‌అప్ అయిన ఉద్యోగికి 12 రోజులు సెలవులు.. CEO ట్వీట్ వైరల్

ఉద్యోగంలో సెలవు తీసుకోవాలంటే కంపెనీలో ఉన్నతాధికారులను దొంగసాకులు చెప్తుంటారు. అయితే ఓ ఎంప్లాయ్ నిజాయితీకి మెచ్చుకోవచ్చు. అందుకే ఆయన గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము. అంతేకాదు ఆ కంపెనీ సీఈఓ ఆయనకు 11 రోజులు లీవ్‌కు కూడా ఇచ్చాడు.

New Update
breakup leave mail

గుర్గావ్‌కు చెందిన కంపెనీ ఉద్యోగి CEO పంపిన సెలవు లెటర్ ఇప్పుడు సోషల్ మీడియా(Social Media) లో వైరల్(viral news telugu) అవుతోంది. ఒక్కరోజు సెలవు తీసుకోవాలంటే కంపెనీలో ఉన్నతాధికారులను దొంగసాకులు చెప్తుంటారు. రకరకాలగా లీవ్స్ కోసం ట్రై చేస్తుంటారు. అయితే ఓ ఎంప్లాయ్ నిజాయితీకి మెచ్చుకోవచ్చు(most honest request). అందుకే ఆయన గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము. అంతేకాదు ఆ కంపెనీ సీఈఓ ఆయనకు 11 రోజులు లీవ్‌కు కూడా ఇచ్చాడు. అసలు మ్యాటర్ ఏంటో చూద్దాం రండీ..

'బ్రేకప్'(Breakup) బాధ నుంచి కోలుకోవడానికి సెలవు కావాలి అంటూ ఉద్యోగి కంపెనీ సీఈఓకి మెయిల్(breakup leave mail) చేశాడు. అతని నిజాయితీకి మెచ్చుకుంటూవెంటనే సెలవు మంజూరు చేశారు. 'నాట్ డేటింగ్'(CEO of Knot Dating) అనే మ్యాట్రిమోనీ యాప్ కో ఫౌండర్, సీఈఓ అయిన జస్వీర్ సింగ్ తన 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) ఖాతాలో ఈ మెయిల్ స్క్రీన్‌షాట్‌ను పంచుకున్నారు. ఆ మెయిల్‌లో ఉద్యోగి ఇలా రాశారు: "సార్, నాకు ఇటీవల బ్రేకప్ అయింది. అందువల్ల నేను పనిపై దృష్టి పెట్టలేకపోతున్నాను. నాకు కొద్దిరోజులు విరామం కావాలి. ఈరోజు నేను ఇంటి నుంచి పనిచేస్తున్నాను. కాబట్టి 28వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సెలవు తీసుకోవాలని అనుకుంటున్నాను."

Also Read :  ఈసారి రిపబ్లిక్ డే డబుల్ ధమాకా.. 2026 జనవరి 26కి ఇండియా చరిత్రలో ఫస్ట్ టైం!

Breakup Leave Letter Goes Viral

ఈ మెయిల్‌ను పంచుకుంటూ జస్వీర్ సింగ్, "నాకు నిన్న అత్యంత నిజాయితీ గల లీవ్ లెటర్(Leave Letter) అందింది. 'జన్ జెడ్' ఫిల్టర్లు వాడరు!" అంటూ వ్యాఖ్యానించారు. అంటే, ఈ తరం యువ ఉద్యోగులు (Gen Z) తమ భావోద్వేగాలు, మానసిక సమస్యల గురించి దాచిపెట్టకుండా, నేరుగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

సెలవు మంజూరు చేశారా అని నెటిజన్లు అడిగిన ప్రశ్నకు, సీఈఓ "వెంటనే సెలవు మంజూరు చేశాను" అని బదులిచ్చారు. ఉద్యోగుల మానసిక ఆరోగ్యం పట్ల సంస్థలు సానుకూల దృక్పథంతో ఉండాలనే సందేశాన్ని ఈ సంఘటన ఇచ్చింది. ఈ సంఘటనపై నెటిజన్లు కూడా స్పందిస్తూ, ఉద్యోగి నిజాయితీని, దానికి మద్దతుగా నిలిచిన సీఈఓ నిర్ణయాన్ని ప్రశంసించారు. పనిప్రదేశంలో భావోద్వేగ సమస్యల గురించి బహిరంగంగా మాట్లాడటం అనేది సానుకూల మార్పుగా పలువురు అభిప్రాయపడ్డారు.

Also Read :  బీహార్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. దూసుకొస్తున్న సైలెంట్ వేవ్.. ఆ కూటమికి ఊహించని షాక్?

Advertisment
తాజా కథనాలు