Shruti Haasan: శృతి హాసన్ డిజిటల్ డీటాక్స్.. సోషల్ మీడియాకు బ్రేక్!
స్టార్ హీరోయిన్ శృతి హాసన్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. కొద్దిరోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఇన్ స్టాలో స్టోరీ పెట్టింది.
స్టార్ హీరోయిన్ శృతి హాసన్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. కొద్దిరోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఇన్ స్టాలో స్టోరీ పెట్టింది.
మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మళ్లీ బుల్లితెరపై రీ ఎంట్రీకి సిద్ధమయ్యారు. ఒకప్పుడు స్టార్ ప్లస్‌లో ప్రసారమైన సూపర్ హిట్ సీరియల్ 'క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ' సీక్వెల్ వెర్షన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
బాలీవుడ్ నటి సయామీ ఖేర్ కేవలం నటనలోనే కాకుండా, ఫిట్‌నెస్‌లో కూడా తన సత్తా చాటుకుంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన సహనశక్తి రేసుల్లో ఒకటైన "ఐరన్ మ్యాన్ 70.3" ట్రయాథ్లాన్‌ను ఒకే సంవత్సరంలో రెండుసార్లు పూర్తి చేసి చరిత్ర సృష్టించారు.
బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా, నటుడు విష్ణు విశాల్ పాప నామకరణ వేడుకకు బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కూడా హాజరయ్యారు. అది మాత్రమే కాదు.. పాపకు స్వయంగా ఆయనే నామకరణం చేశారు.
మలయాళ హీరో ఉన్ని ముకుందన్ ఇన్‌స్టా ఖాతా హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే అభిమానులకు తెలిపారు. తన అకౌంట్ నుంచి ఏవైనా పోస్టులు, డైరెక్ట్ మెసేజ్‌లు లేదా స్టోరీలు వస్తే అవి తాను పెట్టినవి కావని, హ్యాకర్లు పెడుతున్నవని ఉన్ని ముకుందన్ స్పష్టం చేశారు.
హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్ జెర్సీ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మోడల్, నటి మలయాళంలో కోహినూర్ మూవీతో సినిమాల్లోకి వచ్చింది. శ్రద్ధా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ట్రెడిషనల్ లుక్‌లో శారీలో ఉన్న ఫొటోలను షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి శివశక్తి దత్త (92) కన్నుమూశారు. హైదరాబాద్‌లో శివశక్తి దత్త మృతి చెందారు. ఇతను ఛత్రపతి, సై, రాజన్న, బాహుబలి, ఆర్ఆర్ఆర్, హనుమాన్ సినిమాలకు పాటలు రాశారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, శివ శక్తి దత్త సోదరులు అవుతారు.
పవన్ కల్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ నుంచి మరో సర్ప్రైజ్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ టైటిల్ ట్రాక్ వీడియోను ఈ వారంలో రిలీజ్ చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
విజయ్ దేవరకొండ నటిస్తున్న 'కింగ్డమ్' సినిమా విడుదల తేదీ ఖరారైంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 31, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.