/rtv/media/media_files/2025/11/11/bellamkonda-sai-srinivas-2025-11-11-12-34-17.jpg)
Bellamkonda Sai Srinivas
Bellamkonda Sai Srinivas: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. భూకబ్జా ఆరోపణలతో ఆయన పై ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. శివ ప్రసాద్ అనే వ్యక్తి... సురేష్ తన ఇంటిని కబ్జా చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను లేని సమయంలో సురేష్ తన అనుచరులతో కలిసి బలవంతంగా ఇంటిని ఇంటిని ఆక్రమించడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
భూ కబ్జా కేసు
అంతేకాదు తన ఇంటి తాళాలను పగలగొట్టి, ఇంట్లోకి ప్రవేశించి సామాగ్రిని, ఇంటి గోడలను ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకొని శివ ప్రసాద్ తన సిబ్బందిని అక్కడికి పంపగా, సురేష్ వారిని అడ్డుకుని దుర్భాషలాడారని, దాడికి కూడా ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఫిల్మ్ నగర్ పోలీసులు సురేష్ తో పాటు మరో వ్యక్తి పై బీఎన్ఎస్ 329 (4), 324 (5), 351 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కేసు నమోదు
— Telugu Scribe (@TeluguScribe) November 11, 2025
ఫిలిం నగర్ రోడ్డు నెంబర్–7లో నివాసం ఉంటున్న శివ ప్రసాద్ అనే వ్యక్తి
కొంతకాలంగా తన ఇంటికి తాళం వేసి బంధువుల వద్దకు వెళ్ళిన శివ ప్రసాద్
మూడు రోజుల క్రితం ఆ తాళం పగలగొట్టి, ఇంట్లో ఆస్తులు, గోడలు ధ్వంసం చేసి, ఇంటిని ఆక్రమించేందుకు యత్నించిన… pic.twitter.com/bNqRp8982V
గతంలోనూ
ఇదిలా ఉంటే.. గతంలో కూడా బెల్లంకొండ సురేష్ ఇలాంటి వివాదంలో నిలిచారు. 2022లో శరణ్ కుమార్ అనే ఫైనాన్షియర్ సురేష్ బెల్లంకొండ సురేష్, ఆయన కుమారుడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై రూ. 85 లక్షలు మోసం చేశారని చీటింగ్ కేసు పెట్టారు. సినిమా నిర్మాణం కోసం డబ్బు తీసుకొని.. తిరిగి చెల్లించలేదని ఆరోపించారు. అయితే కొద్ది రోజుల తర్వాత ఇరుపక్షాల మధ్య రాజీ కుదరడంతో కేస్ క్లోజ్ అయ్యింది. ఆర్ధిక లావాదేవీల్లో జరిగిన అపార్థం కారణంగానే ఇదంతా జరిగిందని సురేష్ వివరణ ఇచ్చారు. దీని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆయనపై భూ కబ్జా ఆరోపణలు రావడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
Also Read: Hyderabad: కొత్త ఇల్లు కట్టినందుకు లక్ష ఇవ్వాల్సిందే.. కీసరలో యజమానిని దారుణంగా కొట్టిన హిజ్రాలు!
Follow Us