/rtv/media/media_files/2025/11/11/ssmb29-first-song-2025-11-11-08-23-57.jpg)
SSMB29 First Song
SSMB29 First Song: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం గ్లోబ్ ట్రాటర్ నుంచి మొదటి పాట రిలీజ్ అయింది. ఈ పాటను స్టార్ హీరోయిన్ శృతి హాసన్ పాడటం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఆమె గాత్రం గూస్ బంప్స్ తెప్పించేలా ఉండడంతో పాట విని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
Globe Trotter Sanchari Song
శృతి హాసన్(Shruti Haasan) ఈసారి పూర్తిగా తన మ్యూజికల్ టాలెంట్‌ను చూపించింది. “సంచారి” అనే ఈ పాటలో మహేష్ బాబు పాత్ర వీరత్వాన్ని, ఆయన చేసే యాత్రను వర్ణించారు. చైతన్య ప్రసాద్ రాసిన లిరిక్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి “కాలాన్నే శాసిస్తూ ప్రతిరోజూ పరుగే లే, వేగాన్నే శ్వాసిస్తూ పెనుగాలై తిరిగే లే, రారా వీరా ధృవతారా సంచారా…” అంటూ సాగే ఈ లైన్స్ అభిమానులను మంత్ర ముగ్ధుల్ని చేస్తున్నాయి.
లిరికల్ వీడియోలో శృతి హాసన్ పాడుతున్న విజువల్స్ కూడా చూపించారు. ఆమె పాడుతున్న తీరు చూస్తే నిజంగానే పూనకం వచ్చినట్లు అనిపిస్తుంది. సంగీత దర్శకుడు కీరవాణి అందించిన ట్యూన్ ఈ పాటకు మరింత బలాన్నిచ్చింది.
ఇదిలా ఉంటే, ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన మరో అప్డేట్ కూడా వచ్చింది. సినిమాలో విలన్‌గా నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆయన “కుంభ” అనే శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన లుక్‌కి నెటిజన్ల నుంచి మిక్స్‌డ్ రియాక్షన్లు వస్తున్నాయి. ట్రోల్ల్స్ కూడా జరుగుతున్నాయి.
సినిమాలో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్నారు. దాదాపు ₹1000 కోట్ల వ్యయంతో ఈ చిత్రం రూపొందుతోంది.
గ్లోబ్ ట్రాటర్ సినిమా హీట్ రోజు రోజుకూ పెరుగుతోంది. నవంబర్ 15న సినిమా నుంచి ఒక బిగ్ రివీల్ ఉంటుందని టీమ్ ఇప్పటికే ప్రకటించింది. రామోజీ ఫిల్మ్ సిటీలో 100 అడుగుల ఎల్ఈడీ స్క్రీన్‌పై ఈ స్పెషల్ ఈవెంట్ నిర్వహించబోతోందట. ఈ వారం మొత్తం గ్లోబ్ ట్రాటర్కు సంబంధించిన సర్ప్రైజ్ అప్‌డేట్స్ వరుసగా రిలీజ్ చేయనున్నట్టు రాజమౌళి టీమ్ ప్రకటించింది.
మొత్తానికి, మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో వస్తున్న గ్లోబ్ ట్రాటర్ ప్రతి అప్‌డేట్‌తో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. శృతి హాసన్ పాడిన “సంచారి” పాట ఆ అంచనాలను మరింత పెంచింది.
Follow Us