/rtv/media/media_files/2025/11/11/rajamouli-2025-11-11-08-43-53.jpg)
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. సాధారణ ఓటర్లతో పాటుగా సెలబ్రేటీలు కూడా పోటీ పడుతున్నారు. ప్రముఖ సినీ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన తమ కుటుంబ సభ్యులతో కలిసి షేక్‌పేటలోని పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. అలాగే నటుడు శ్రీకాంత్ కుటుంబ సభ్యులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
షేక్ పెట్ లో ఓటు హక్కు వినియోగించుకున్న దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి#SSRajamoulipic.twitter.com/OeuzNCO81m
— ap7am (@ap7am) November 11, 2025
407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. నియోజకవర్గంలో మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. భద్రత కోసం 1,761 మంది పోలీసులు, 800 మంది కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నికల్లో డ్రోన్లను తొలిసారిగా వినియోగిస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ ఉపఎన్నికలో 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్‌లో వెంగళరావు నగర్ పోలింగ్ బూత్ వద్ద సత్తుపల్లి MLA భర్త దయానంద్‌పై BRS నేతలు ఆర్వోకి ఫిర్యాదు చేశారు. ఆయన ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని BRS ఆరోపించింది. మరోవైపు, బోరబండలోని బూత్ 348లో ఈవీఎం మొరాయించడంతో పోలింగ్ ఆలస్యమైంది. సాంకేతిక లోపాన్ని సరిదిద్దే పనిలో అధికారులు ఉన్నారు.
Follow Us